కరోనా సమయంలో కూడా బిగ్ బాస్ 4 విజయవంతం చేసిన జోష్ తో.. తాజగా బిగ్ బాస్ 5 కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు నిర్వాహకులు. ప్రస్తుతం తతంగం అంతా జూమ్ యాప్ వేదికగానే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 5 నుంచి ఈ సీజన్ మొదలు కానుందని సమాచారం. ఎలాగైనా సరే సెప్టెంబర్ లో సీజన్ 5 స్టార్ట్ చేయాలని చూస్తున్నారు నిర్వాహకులు. దీనికోసం చాలా గట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ షో మొదలవ్వకముందే అనేక చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు మొదలు కానుంది.. ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయాలు ఆరా తీస్తూనే ఉన్నారు అభిమానులు.

అయితే నిర్వాహకులు మాత్రం ఎలాంటి సందడి లేకుండా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. కరోనా నేపధ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సారి షణ్ముక్ జస్వంత్, శేఖర్ మాస్టర్, టిక్ టాక్ స్టార్ భాను సహా అనేకమంది ప్రముఖులు లిస్టు లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా మరో సెన్సేషనల్ కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ 5 తెలుగులో అడుగుపెట్టనున్నాడని తెలుస్తుంది.
ఆయనెవరో కాదు.. కమెడియన్ అలీ.. సుమారు 40 సంవత్సరాలు తెలుగు పరిశ్రమలో స్టార్ కమిడియన్ ఎదిగిన అలీ బిగ్ బాస్ షో లో ఉంటే వస్తే కచ్చితంగా షో మైలేజ్ భారీగా పెరుగుతుందని స్టార్ మా భావిస్తుంది. అందుకే ఆయన్ని ఒప్పించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. అందుకోసం ఆయనకు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి స్టార్ మా అడుగులు వేస్తోందట. అయితే ప్రస్తుతం సినిమాలో అలీ జోరు తగ్గడంతో.. బుల్లితెరపై వ్యాఖ్యాతగా బిజీ అయిపోయాడు. అలాగే అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే దీనికి అలీ ఒప్పుకుంటాడో లేదో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అన్నీ వర్కవుట్ అయి అలీ బిగ్ బాస్ లో అడుగుపెట్టాడంటే ఇక బిగ్ బాస్ సంచలనాలకు వేదిక అవుతుందేమో..!































