అక్కినేని వారి కోడలు, నాగ చైతన్య భార్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత బుల్లితెర మీద అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. మామ నాగార్జున బాటలో నడిచేందుకు రెడీ అవుతుంది ఈ “బేబీ”… “ఓ..బేబీ” సినిమా తరువాత అటు తెలుగులో, ఇటు తమిళంలో కొత్త సినిమాలు సైన్ చేయకపోయేసరికి.. అంతా ఆమె నెల తప్పిందని కొందరు, పిల్లలని ప్లాన్ చేసుకోవడానికి అని కొందరు, రకరకాలుగా కామెంట్స్ చేసారు. పిల్లల కోసమే సమంత సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందని కామెంట్స్ చేస్తున్నా ఈ బ్యూటీ మాత్రం సైలెంట్ గా “96 ది ఫ్యామిలీ మ్యాన్ 2” షూటింగ్ పూర్తి చేసింది.
అయితే సమంత కొత్త సినిమాలు సైన్ చేయకపోవడానికి కారణం అవేమి కావని, మామయ్య నాగార్జున బాటలో నడిచేడుకాని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఆమె బుల్లితెర షో చేయడం కోసం రంగం సిద్ధం చేసుకుంటుందట. ఒక ప్రముఖ ఎంటెర్టైమెంట్ ఛానెల్ లో సమంత హోస్ట్ గా ఓ టాక్/గేమ్ షో మొదలుపెట్టే పనిలో బిజీగా ఉందట. టాలీవుడ్ సెలెబ్రెటీలు పాల్గొనే విధంగా ఈ షోను డిజైన్ చేశారట.
అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఈ గేమ్ షోకి గెస్టులుగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందట సమంత. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ షో కోసం తెగ కష్టపడుతుందట సామ్. సో ఈ షో ప్రేపరషన్ కోసమే ఈ అమ్మడు సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుందట. దేనికోసం మామ నాగార్జున సలహాలు తీసుకుంటుందట. నాగార్జున ఆల్రెడీ “బిగ్ బాస్”, “మీలో ఎవరు కోటీశ్వరుడు” వంటి రియాలిటీ షో లలో తన టాలెంట్ నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అదే కోవలో కోడలు సమంత కూడా నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. వెండితెర మీద టాప్ హీరోయిన్ మాయ చేసిన అక్కినేని వారి కోడలు, బుల్లితెర మీద ఈ మాయ చేస్తుందో చూడాలి.



























