పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ గిరిజన యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు.. ఆమె మర్మాంగాల్లో ఇనుప రాడ్లు జొప్పించారు. ఆ స్థితిలో ఆమెను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. రాత్రంతా ఆమె అక్కడే గడిపింది. మరుసటిరోజు తీవ్రగాయాలతో పడిఉన్న యువతిని చూసిన ఓ వ్యక్తి..కుష్మండి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న బాధితురాలిని మాల్డా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు. రామ్ ప్రభేష్ శర్మ, మరో వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు ఆమె చెప్పారు.ఈ దారుణ కృత్యానికి పాల్పడ్డ ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రసూన్ బెనర్జీ వెల్లడించారు. వారిపై నిర్భయ, ఇతర క్రిమినల్ కేసు నమోదుచేసినట్లు తెలిపారు..



























