గుంటూరు బౌన్స్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. గుంటూరు పోలీసులు బ్యూటీపార్లర్ పై దాడిచేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. ఈ సంఘటన గుంటూరు లోని త్రీటౌన్‌లో శనివారం చోటుచేసుకుంది.

బౌన్స్ సెలూన్ అండ్ బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయారు. వ్యభిచారానికి పాల్పడుతున్న 10 మంది అమ్మయిలతో పాటు మరో ముగ్గురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్ష రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.



























