ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెబుతోంది ఏపీ సర్కార్. తాజగా మహిళలకు శాశ్వత ఉపాది మరియూ వ్యాపార అవకాశాల్లో అన్నివిధాలా వారికీ తోడ్పాటు అందించడం కోసం 14 కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జీవోలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది ఏపీ సర్కార్.

ఈ క్రమంలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా అర్హులైన మహిళలకు నగదు అందించి ఆపై వారికి వ్యాపారాల్లో పెట్టుబడికి వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా కనీసం 6 లక్షల మహిళల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలు చేతివృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమెడ్ దుస్తుల విక్రయానికి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్ మార్కెట్‌లో అవకాశాలు కల్పిస్తారు.



























