ఈ ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ విషయంలో ఇదివరకు కూడా అనేక వివాదాలు నడిచాయి. దీనిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అయితే తాజాగా మళ్లీ ‘మా’ ఎలక్షన్స్ వస్తున్న నేపధ్యంలో సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ఎలేక్షన్స్ హీట్ మొదలైపోయింది.. ఇప్పటికే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తెలుగు హీరోయిన్, వైజాగ్ బ్యూటీ రేఖా భోజ్ గమ్మత్తైన డిమాండ్‌ని తెరపైకి తీసుకుని వచ్చింది.

డైలాగ్స్ ఉన్న రోల్స్ మూడు సినిమాల్లో చేసి ఉండాలి, టైటిల్ కార్డ్స్ లో పేరు ఉండాలి అన్నదే ఒక పెద్ద కష్టమైన పని. అదే అతి పెద్ద కండిషన్. ఇంక లక్ష రూపాయలు దేనికి మా లో మెంబర్ షిప్ కార్డ్ కి ఎవరు పడితే వాళ్లు రాకుండా ఫిల్టర్ చేయడానికి అని ఒకరు నాతో చెప్పారు. అసలు టైటిల్ కార్డ్ తో మూడు సినిమాలు చేయడం అన్న దగ్గరే ఫిల్టర్ అయిపొయిందిగా. నా లాంటి వాళ్లు 4 సినిమాలు చేసినా మా ఖర్చులకి కూడా సరిపోవు ఆ డబ్బులు. ఇంక లక్ష ఎక్కడి నుంచి తేవాలి. మనవాళ్ళు తెలుగు అమ్మాయిలకు ఎంత గొప్ప పేమెంట్స్ ఇస్తారో అందరికీ తెలుసు అండ్ ఎక్కువ అడిగితే వాళ్ళు ఏం అడుగుతారో (ఉద్యమాలు కూడా అయ్యాయి ఈ మ్యాటర్ లో) అది కూడా ఇంకా బాగా తెలుసు అందరికీ..
లక్ష రూపాయలు కట్టే స్థోమత లేకపోతే ఇంక నేను లేదా ఇంకెవరైనా చేసిన పాత్రలన్నీ గంగలో పోయినట్టేనా. కనీసం ఆ రుసుము ఒక 25,000 అయినా చేయచ్చు కదా. లేదా ఒక్కసారిగా కాకుండా నెల నెలా కొంత చెల్లించే పద్ధతిని పెట్టచ్చుగా. ఈ మాట అండ్ ఒపీనియన్ నా ఒక్కదానిదే కాదు. చాలామంది అనుకునేదే. నేను సెట్స్ లో చాలాసార్లు విన్నదే. ఈ విషయం లాస్ట్ టైం నరేష్ గారు గెలిచినప్పుడు కూడా నేను పోస్ట్ పెట్టాను. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్ కాబట్టి పోస్ట్ పెడుతున్నాను. గెలిచాక ఎలాగూ పట్టించుకోరు కాబట్టి, కనీసం ఇప్పుడైనా ఎవరైనా దీని గురించి ప్రస్తుత పోటీదారులతో మాట్లాడతారేమో అని ఆశ. మీరు అన్ని లక్షలు పెట్టి స్టూడియో కట్టారుగా, మీకేం తక్కువ అని క్వశ్చన్స్ వేయకండి. ఎందుకంటే ఇదంతా నా ఒక్కదాని కోసం అడగడం లేదు. నా స్టూడియో లోన్ అమౌంట్ కట్టాను. ఒకవేళ ఈ పోస్ట్ లో ఏమైనా తప్పులు వుంటే, లేటెస్ట్ గా ఏవైనా సవరణలు జరిగి ఉంటే తెలుపగలరు. అంటూ చివరిలో నోట్ కూడా పెట్టింది.































