ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు మనకు ఆధార్, మొబైల్ లింక్ చేసుకోండి.. అంటూ మొబైల్ కంపెనీలు మెసేజ్‌ల మీద మెసేజ్‌లను పంపిస్తూనే ఉన్నాయి. అలాగే కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉన్నాయి. అయితే అది ఇంత వరకు బాగానే ఉంది. కానీ..
మీరు ఎయిర్‌టెల్ కస్టమర్లా..? మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేశారా..? మీకు గ్యాస్ సబ్సిడీ ఏ బ్యాంక్ అకౌంట్‌లో పడుతోంది. ఏంటీ.. అసలు సబ్సిడీయే రావడం లేదా..? అయితే అందుకు కారణం ఏంటో తెలుసా..? మీరు మీ ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడమే..! అవును, మీరు విన్నది అక్షరాలా నిజమే. ఏంటీ.. మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తే గ్యాస్ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో ఎందుకు పడదు..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? అయినా మేం చెబుతోంది నిజమే. ఎందుకో కింద ఇచ్చింది చదివి మీరే తెలుసుకోండి..!

ఎయిర్‌టెల్ అన్ని మొబైల్ కంపెనీల కన్నా కొంచెం భిన్నం కదా. కనుక అది ఏం చేస్తుందంటే. మనం మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయమని ఎయిర్‌టెల్ స్టోర్‌కు వెళ్తాం కదా. అప్పుడు వారు మొబైల్ నంబర్‌ను, ఆధార్ ను లింక్ చేస్తారు.కానీ వారు మనకు తెలియకుండానే మన పేరిట ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌ను ఓపెన్ చేస్తారు. ఆ విషయం మనకు తెలియదు. ఇక దీంతో ఆధార్ అనుసంధానం అవుతుంది. కనుక యథావిధిగా లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ సీడింగ్ అయిన వివరాల ప్రకారం మనకు వచ్చే గ్యాస్ సబ్సిడీ సొమ్ము ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు వెళ్తుంది.ఇది ఇలా చాలా మందికి జరిగింది.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో పైన చెప్పిన విధంగా మొత్తం ఇప్పటి వరకు రూ.167 కోట్ల గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ అయిందట. అవును మీరు విన్నది కరెక్టే. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్ తదితర కంపెనీలకు చెందిన అనేక కోట్ల మంది కస్టమర్ల ఎల్‌పీజీ సబ్సిడీ సొమ్ము వారి వారి ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లలో జమ అయింది.
ఈ విషయాన్ని ఆధార్ బాడీ (UIDAI)) కూడా ధృవీకరించింది. అందుకనే తాజాగా ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లకు ఆధార్ ఈ-కేవైసీ లైసెన్స్‌ను ఆధార్ బాడీ(UIDAI) సస్పెండ్ చేసింది. దీంతో ఎయిర్‌టెల్‌లో ఇప్పుడు ఆధార్, మొబైల్ లింక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అంతేకాదు, కొత్తగా పేమెంట్స్ బ్యాంక్‌లను కూడా ఓపెన్ చేయడానికి వీలులేదు.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది. కనుక.. మీరు కూడా మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసి ఉండి, గ్యాస్ సబ్సిడీ పడకపోతుంటే.. అప్పుడు మీరు మీ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌లో సబ్సిడీ సొమ్ము జమ అయిందో లేదో చేక్ చేసుకోండి.
లేదంటే.. ఎయిర్‌టెల్ వాడు ఆ సొమ్మును కాజేస్తాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!



























