రజినీకాంత్ రాకీయ ప్రవేశం గురించి దాదాపు 20 సంవత్సరాలకు పైగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆయన అభిమానులు రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని, తమిళనాడు రాష్ట్రానికి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో రజినీకాంత్ అత్యంత ఒత్తిడికు గురవుతున్న విషయం తెలిసిందే..

అయితే తాజాగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశమయ్యారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈరోజు అనగా సోమవారం ఈ సమావేశం జరిగింది.

ఆ సమావేశం తరువాత పోయెస్ గార్డెన్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ.. తాను సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే నేను అమెరికా వెళ్లొచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగులు, కరోనా పరిస్థితుల రీత్యా గడచినా కొంతకాలం నుంచి మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. అయితే నేను రాజకీయాల్లోకి రావట్లేదని రజనీ ప్రకటించారు.



























