రానా దగ్గుబాటి.. తన తాత రామానాయుడు పేరులోని మొదటి అక్షరాలను పెట్టుకొని రానాగా అయ్యారు. తెలుగు ఇండస్ట్రీలో రానాకు ఉన్న క్రేజ్ వేరు. తనకు సినిమా ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ ఉన్నప్పటికీ.. రానా మాత్రం అస్సలు తన ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోకుండా తనంతట తానే ఎదిగారు. స్టార్ హీరోగా ఎదిగారు. రానా ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పటి వరకు రానా చేసిన ఏ సినిమా అయినా సరే.. ఏదో ఒక మంచి మెసేజ్ ను కలిగి ఉంటుంది.

ఓవైపు ఇండస్ట్రీలో తన బాబాయ్ విక్టరీ వెంకటేశ్ ఉన్నా.. తన తండ్రి సురేశ్ బాబు బడా నిర్మాత అయినా కూడా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రానా గురించి చెప్పాలంటే ఒక బాహుబలి సినిమా చాలు. ఆ సినిమాలో ఎంత పవర్ ఫుల్ విలన్ రోల్ వేశారో అందరికీ తెలుసు. బాహుబలి సినిమాకు హీరో పాత్ర ఎంత ముఖ్యమో.. విలన్ పాత్ర కూడా అంతే ముఖ్యం. ప్రపంచం మొత్తం మెచ్చిన సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం అంటే అది అంత ఈజీ కాదు. అది రానాకు దక్కడం అనేది నిజంగా రానా ఎంత కష్టపడేతత్వం ఉన్న నటుడో అర్థం చేసుకోవచ్చు.

రానా ఏ సినిమా చేయాలో నన్ను ఏనాడూ అడగడు
రానా ఈ సినిమా చేయిరా అన్నా కూడా చేయడు. వాడు నేను ఏం చెప్పినా వినడు. తనకు ఏది నచ్చితే అది చేస్తాడు. ఇలాంటి సినిమా చేయ్ అన్నా వినడు. అలాంటి సినిమా చేయ్ అన్నా వినడు. నాకు నచ్చిన సినిమా చేస్తా అంటాడు రానా. అలాగే.. ఏ సినిమాలో నటించాలో కూడా నన్ను ఏనాడూ అడగడు. కాకపోతే ఈ సినిమా చేస్తున్నా అని చెబుతాడు. దీంతో నేను కూడా ఓకే అని చెప్పేస్తాను అంతే.. అని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు.

రానా తీసుకునే ప్రతి నిర్ణయం వాడిదే.. ఎవ్వరూ ఇన్వాల్వ్ కారు
రానా తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే.. ఆయన సొంతంగానే తీసుకుంటారట. తన తండ్రిని కానీ.. తన బాబాయ్ వెంకటేశ్ ను కానీ.. ఏ సినిమా చేయాలని కూడా అడగరట. అలాగే.. ఎటువంటి సలహాలు కూడా తీసుకోరట. తనకు నచ్చిన సినిమా చేస్తారట. రానాకు తన సొంత కల వేరే ఉందట. ఆ కల కోసం ఎవ్వరి మాటా వినకుండా.. తనకు ఏది నచ్చితే అది చేస్తారట. ఆయన ఏది చేసినా కూడా ఎక్కువగా సురేశ్ బాబు కూడా ఇన్వాల్వ్ కారట. ఈ విషయాన్నే సురేశ్ బాబు.. ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అభిరామ్ కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తున్నాడు
సురేశ్ బాబు చిన్నకొడుకు అభిరామ్ కూడా త్వరలోనే సినిమాల్లోకి వస్తున్నాడట. త్వరలోనే ఓ సినిమా ఫైనల్ అవ్వబోతోందని సురేశ్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే అభిరామ్ యాక్టింగ్ కూడా నేర్చుకున్నారట. కథ కూడా సిద్ధం చేశారట. కరోనా వల్ల సినిమా ప్రకటన లేటవుతోందని సురేశ్ బాబు అన్నారు.



























