తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాల రేపు వెలువడనున్నాయి. అభ్యర్థులందరికీ గెలుస్తామా?, ఓడిపోతామా? అనే టెన్షన్ ఫుల్లుగా ఉంది. అయితే ఈ ఉత్కంఠకు శనివారం తెరపడనుంది. దీనికి సంబందించి అధికారులు ఇప్పటికే కౌంటింగ్ కు పూర్తి ఏర్పాట్లు చేసేసారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా కౌంటింగ్ చేపడుతున్నారు. 5 రౌండ్లనుంచి 24 రౌండ్ల వరకు లెక్కిస్తారట. కౌంటింగ్ మునిగిన అనంతరం 27న మున్సిపల్ ఛైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నిక నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి తెలిపారు.
120 మున్సిపాలిటీల్లో, 1647 వార్డులు, 9 కార్పొరేషన్లలో 324 డివిజన్లకు బుధవారం పోలింగ్ జరిగింది. కరీంనగర్ లో అయితే శుక్రవారం కూడా పోలింగ్ జరిగింది.



























