సరిత ఈపేరు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేరు. ఒకప్పటి దక్షిణాది హీరోయిన్. ఎంతో అద్భుతమైన నటనతో ఎందరో ప్రేక్షకుల గుండెల్లో కొలువయింది సరిత. అంతేకాదు సరిత గాత్రం వింటే ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఎంతోమంది హీరోయిన్స్ కి తన గాత్రాన్ని అరువుగా ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అయితే సరిత చూడడానికి నల్లగా ఉన్నా ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో విరిసిన ఒక నల్ల కలువ అని అప్పట్లో సరితను పిలిచేవారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది సరిత. అంతేకాకుండా ఎందరో తెలుగు, తమిళ హీరోయిన్స్ కు డబ్బింగ్ కూడా చెప్పింది. అన్ని భాషల్లో కలుపుకుని మొత్తం 150 సినిమాలు దాక చేసింది. అన్ని భాషల్లో కలుపుకుని 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు అనేక అవార్డ్స్ అందుకుంది.

అలాగే ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అర్జున్’ అనే సినిమాలో అండాలు అనే నెగటివ్ పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఈ సినిమాకు గాను సరితకు నంది స్పెషల్ డ్యూరి అవార్డు అందుకుంది. గుంటూరులో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి బాల చందర్ తీసిన మరో చరిత్ర సినిమా ద్వారా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అప్పట్లో సరిత సంచలనం సృషించింది. లెక్కకు మించి సినిమాల్లో నటించిన గాని, ఎన్ని అవార్డులు అందుకున్నా గాని సరిత వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడి దుడుగులతో ముందుకు సాగింది. సరిత రెండు సార్లు పెళ్లి చేసుకుంది. 1975 లో తెలుగు రంగస్థల నటుడు వెంకట సుబ్బయ్యను పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్ళైన మరుసటి సంవత్సరమే అంటే 1976 లో భర్తతో విడిపోయింది.

ఆ తరువాత 1988 లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లి చేసుకుంది. వాళ్లకు శ్రవణ్, తేజ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. తర్వాత విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2007 లో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. ఆ తరువాత ముఖేష్ క్లాసికల్ డాన్సర్ అయిన మిథిల్ దేవికను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉన్నపుడు తాను దుబాయ్ లో ఉన్నానని, కోర్టు పంపిన నోటీసులు తాను అందుకోలేదని తెలిపారు. ఫలితంగా కోర్టుకు హాజరు కాలేకపోయాను. అలా కోర్టు విడాకులు మంజూరు చేసిందని తేలిపారు. ముఖేష్ రెండవ వివాహం చెల్లదని కోర్టు తిరిగి తీర్పును ఇవ్వాలని న్యాయస్థానం ని కోరారు. అప్పుడు విచారణ కోసం కోర్టుకు హాజరు అయిన సరిత కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయారు. కోర్టుకి ముఖేష్ కూడా హాజరు అయ్యారు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. సరిత మాత్రం తన ఇద్దరి కొడుకులతో దుబాయ్ లోనే ఉంటుంది. ముఖేష్ మాత్రం తన కొత్త ఫ్యామిలీతో ఏర్నాకులంలో ఉంటున్నాడు.

అయితే ముఖేష్ తో మనస్పర్థలు రావడానికి గురించి తెలుసుకుంటే.. సరితకు ముఖేష్ తో పెళ్లి అయిన తరువాత కూడా పద్ధతిగా ఉండే మంచి పాత్రలు చేయడానికి కూడా అంగీకరించలేదు. ఈ కారణంగానే ఎన్నో మంచి సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయానని పలు సందర్భాల్లో తెలిపింది సరిత. అలాగే నా పట్ల ముఖేష్ అనుచితంగా ప్రవర్తించేవాడు. అలాగే శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అతని బాధ్యత రాహిత్యం, మద్యానికి బానిస అవ్వడం ఇవన్నీ పిల్లలపై ప్రభావం చూపాయని, అందుకే ముఖేష్ నుండి విడిపోవాలని అనుకున్నాను అని తెలిపారు. అలాగే సరిత మన తెలుగు హీరోయిన్స్ కు చాలా మందికి డబ్బింగ్ చెప్పింది. టబూ, నగ్మా, సుస్మితాసేన్, విజయశాంతి, రమ్య, రాధిక, సుహాసిని లాంటి టాప్ హీరోలకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాదు మా ఆయన బంగారం, అంతఃపురం వంటి సినిమాల్లో సౌందర్యకి డబ్బింగ్ చెప్పి బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అవార్డు కూడా వచ్చింది. ఇన్ని ఒడిదుడుకులతో సరిత జీవితం ముందుకు సాగింది.



























