భారత దేశంలో దైవభక్తికి ఎంతగా గౌరవిస్తారో..దెయ్యం అంటే కూడా అంతగా భయపడతారు. అయితే సామాన్య జనాన్ని కొంత మంది దొంగ సాధువులు దైవభక్తితో..భూత భయంతో రెండు రకాలుగా మోసం చేస్తుంటారు. చాలా మంది దొంగ సాధువులు మంచితనం ముసుగులో చేసే అక్రమాలు ఎన్నో బయట పడిన సంఘటనలు ఉన్నా..పబ్లిగ్గా వారి నేరాలు బయట పడ్డా మూఢ భక్తులు మాత్రం వారిని పూజిస్తూనే ఉంటారు.
మనదేశంలో ఎంతో మంది దొంగ స్వాములు వందల వేల కోట్లు సంపాదించి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది అమాయకులను దేయ్యం పట్టిందని, చేతబడి, బానామతి అని శాంతి పూజలు చేయాలని ఊదరగొడుతుంటారు. అందినంత డబ్బు దండుకొని బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా వివాహిత తో అడ్డంగా దొరికిన స్వామి రాసలీలల వీడియో వైరల్ అవుతోంది.



























