కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్‌లు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవల గ్రీన్ ఫంగస్ తొలి కేసు సైతం నమోదైన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో గ్రీన్ ఫంగస్ రెండో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం సృష్టించగా.. వైద్య బృందం అప్రమత్తమైంది.

61 ఏళ్ల వ్యక్తి మార్చిలో కరోనా బారినపడి కోలుకోగా.. తాజాగా గ్రీన్‌ఫంగస్ నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి బాబా బకాలా నివాసి.. అమృత్‌సర్ రోడ్‌లోని మక్సూద్‌లోని సేక్రేడ్ హార్ట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.



























