తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు ఎన్నో రకాల పాత్రలు చేశారు. అందులో భాగంగానే పలువురు హీరోలు సీక్రెట్ ఏజెంట్స్ పాత్రలు చేశారు. జనాలను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇప్పటికే గూఢాచారులుగా కృష్ణ, శోభన్ బాబు, రాజశేఖర్, చిరంజీవి, మహేష్ బాబు, కమల్ హాసన్ , బాలయ్య, అడవి శేష్, గోపీచంద్, నాగార్జున, ఎన్టీఆర్, కమల్ హాసన్ నటించి మెప్పించారు. తాజాగా కళ్యాణ్ రామ్, అఖిల్ సీక్రెట్ ఏజెంట్లుగా మన ముందుకు రాబోతున్నారు.

తాజాగా కళ్యాణ్ రామ్ తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాలను ప్రకటించాడు. అందులో డెవిల్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటీష్ ఏజెంట్‌గా వ్యవహరించిన ఇండియన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించబోతున్నారు. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకత్వం చేస్తున్నాడు. అటు అఖిల్ అక్కినేని కూడా ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ తరహాలో అఖిల్ పాత్ర ఉంటున్నట్లు తెలుస్తోంది.

అటు నాగార్జున ఇప్పటికే వైల్డ్ డాగ్‌లో రా ఏజెంట్‌గా నటించాడు. రెండేళ్ల క్రితం చాణక్య చిత్రంలోనూ గోపీచంద్ రా ఏజెంట్‌గా చేశాడు. అడవి శేష్ నటించిన గూఢచారి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కమల్ హాసన్ సైతం విశ్వరూపం సినిమాలో రా ఏజెంట్ గా పనిచేశాడు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ మహేష్ రా ఏజెంట్‌గా నటించాడు. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. పైసా వసూల్ మూవీలో బాలకృష్ణ రా ఏజెంట్‌గా కనిపిస్తాడు.
రాజశేఖర్ పీఎస్‌వీ గరుడవేగలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసి మంచి విజయం సాధించాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం కంత్రి మూవీలో రా ఏజెంట్‌గా కనిపించారు. గూఢచారి నెం.1 సినిమాలో చిరంజీవి సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. రుద్రనేత్ర సినిమాలోనూ రా ఏజెంట్‌గా కనిపించాడు మెగాస్టార్. శోభన్‌బాబు జగత్ జెట్టీలు, ఖిలాడీబుల్లోడు సినిమాల్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేశాడు. గూఢచారి 116, గూఢచారి117 సినిమాల్లో సూపర్‌స్టార్ కృష్ణ సీక్రెట్ ఏజెంట్‌గా నటించి మెప్పించాడు.
































