సుడిగాలి సుధీర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈపేరు తెలియని వారు ఎవరు ఉండరేమో ! “జబర్దస్త్” అనే కామెడీషో తో తిరుగులేని ఇమేజ్ ని సంపాదించుకున్న సుధీర్. స్మాల్ స్క్రీన్ పై తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు. స్వతహాగా మేజిషన్ అయినా సుధీర్… టీవీ ప్రేక్షకులు అందరిని బాగానే మ్యాజిక్ చేసి తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ ని వెండితెరపై చేయడానికి సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే “సాఫ్ట్ వేర్ సుధీర్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఆ చిత్రం సుధీర్ అభిమానులను కొంచెం నిరాశపరిచిందని ఇండస్ట్రీ టాక్.. అయితే ఆ చిత్ర నిర్మాత వెర్షన్ వేరేలా ఉంది. తనకు ఆ చిత్రంతో ఫుల్లుగా లాభాలు వచ్చాయి అంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయిన నిర్మాత శేఖర్ రాజు ఈ చిత్రాన్ని 3 కోట్ల రూపాయలతో నిర్మించాడు. ఇక సుధీర్ సినిమా కొనడానికి బయ్యర్లు కూడా లేకపోవడంతో సీడెడ్, నైజాంలో సొంతగా తానే రిలీజ్ చేసుకున్నాడు.
ఇక పొతే “సాఫ్ట్ వేర్ సుధీర్” ఓన్లీ సుధీర్ ఇమేజ్ తోనే విడుదలైంది. అయితే సుధీర్ ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడట. రిలీజ్ అయినా తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాలో కథ పాత చింతకాయ పచ్చడి కావడం, స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టించేట్టుగా ఉండటం, కేవలం సుధీర్ తప్ప సినిమాలో చూడటానికి ఏమి లేకపోవడం. హీరోయిన్ ధన్య బాలకృష్ణ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఇలా చెప్పుకుంటూ పొతే సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాకు చాలా మైనస్ లే ఉన్నాయి. ప్రేక్షకులు సుధీర్ చేసిన డాన్సులుతో కొంచెం ఊరట కలింగించే విషయం.
సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా తొలిరోజు కాస్త ఓపెనింగ్స్ బాగానే వచ్చాయట, తొలిరోజు 30 లక్షలు వరకు షేర్ వచ్చిందని తెలుస్తోంది. అయితే రెండవ రోజునుంచి కలక్షన్ల దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు ఓకే అనిపించిన సుధీర్ ఆ తరువాత మాత్రం ఢీలా పడిపోయాడు. కోటిన్నర వరకు బిజినెస్ చేసిన ఈ సినిమాకి బయ్యర్లు బాగా నష్టపోయారట. అయితే నిర్మాత శేఖర్ రాజు మాత్రం తనకు ఈ చిత్రంతో దాదాపు 5 కోట్ల వరకు లాభాలు వచ్చాయని… ఖచ్చితంగా సుధీర్, రష్మీ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాని అంటున్నాడు. మొత్తానికి అసలు కథ ఏమిటో ఆ పెరుమాళ్ళకే ఎరుక.



























