ప్రస్తుతం కరోనా తరువాత వస్తున్న బ్లాక్ ఫంగస్ ప్రజలను ఎక్కువగా భయపెడుతుంది. కరోనా సోకిన సమయంలో చికిత్సలో భాగంగా పలు స్టిరాయిడ్‌లు వాడుతున్నారు. అయతే వారు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత దవడల నొప్పి, పళ్ల చిగుళ్ల వాపు, చీము, రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాలని విజయవాడకు చెందిన దంత వైద్యుడు, శస్త్ర చికిత్స నిపుణుడు ఎ.శ్రీధర్‌రెడ్డి చెబుతున్నారు.

అయితే కొన్ని సందర్భాల్లో కరోనా వల్ల దంతాలకు రక్త సరఫరా జరిగే నాళాల్లోనూ క్లాట్‌లు ఏర్పడటంతో (థ్రాంబోసిస్) రక్త సరఫరా నిలిచిపోయి నెర్కోసిస్‌కు (కణజాలం చనిపోవడం) దారి తీస్తోందని, ఆ తర్వాత అక్కడ ఫంగస్ దాడి చేస్తోందని వివరించారు. సైనస్‌లపై బ్లాక్‌ఫంగస్ దాడి చేస్తే అది దంతాలకూ వ్యాపించే అవకాశముంటుందని శ్రీధర్‌రెడ్డి తెలిపారు.



























