మన దేశంలో క్రికెట్, సినిమా రెండికితీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇక క్రికెటర్లు, నటీనటుల క్రేజ్ అంతా ఇంతా కాదు. మరో విషయం ఏంటంటే.. అయితే క్రికెటర్లు, సినిమా హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. వారిలో కొందరు పెళ్ళిళ్ళు చేసుకోగా.. మరికొందరు మధ్యలోనే విడిపోయి వేరేవారిని వివాహాలు చేసుకున్న వారు ఉన్నారు.. ఇక అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబెయేది టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నగ్మా ఎపిసోడ్ గురించి.. గంగూలీ జీవితంలో అత్యంత వివాదస్పదమైంది హీరోయిన్ నగ్మా తో జరిగిన ప్రేమాయణం.

సౌరవ్ గంగూలీ ఇండియాని ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొత్త అడుగులు వేయిస్తున్న సమయం.. మరోవైపు నగ్మా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తూ పలు భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగుతున్న రోజులు.. ఇలాంటి పీక్ కెరీర్స్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో పడ్డారని అటు క్రికెట్ ప్రపంచం ఇటు సినిమా ప్రపంచం షాక్ కి గురయింది. 1999 వరల్డ్ కప్ సమయంలో లండన్ లో వారిద్దరూ కలిసి కనిపించడంతో వారిపై పుకార్లు మొదలయ్యాయి.

అప్పటికే పెళ్ళైన సౌరవ్ గంగూలీ కి పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి సమయంలో గంగూలి వైవాహిక జీవితంలో ఈ నగ్మాతో ఎఫైర్ ఎపిసోడ్ ఓక భారీ సునమీనే సృష్టించింది. అయితే గంగూలీ కెప్టెన్ అయిన తరువాత కూడా వీరిద్దరి మధ్య వ్యవహారం కోనసాగింది. ఇక 2002లో శ్రీకాళహస్తి వచ్చి సర్పదోష నివారణ పూజ చేయించుకున్న వారిద్దరూ మీడియా కంట పడడంతో ఈ విషయం మరింత సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో అనేక రూమర్లు చుట్టుముట్టాయి. గంగూలీ నగ్మాను సెక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడంటూ రకరకాల వార్తలొచ్చాయి.. అయితే ఆ వార్తలను వీరిద్దరూ ఖండించారు.

అయితే, కొన్నాళ్ళ కిందట నగ్మా.. తనకు సౌరవ్ గంగూలీతో ఎఫైర్ ఉందని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. “ఆ సమయంలో నేను సినీ కెరీర్ పీక్స్ లో సమయం.. అదే విధంగా క్రికెటర్‌గా గంగూలీ కెరీర్ కూడా. అయితే అదే సమయంలో మా ఇద్దరి బంధానికి ఇగో అడ్డుగా ఉండటంతో.. అనుబంధంలో అహానికి చోటు ఉండదు ఒకవేళ ఉంటె.. ఆ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేం కదా” అంటూ కామెంట్ చేసింది నగ్మా. అయితే గంగూలి ఆ సమయంలో నగ్మా ప్రవర్తన నచ్చకపోవడంతో వారి బంధానికి పుల్ స్టాప్ పెట్టి.. కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చాడని అభిమానుల వాదన. ఆ తర్వాత నగ్మా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. 46 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది.































