వేడుకలో స్టేజీపై యాక్టివ్‌గా కదులుతూ డాన్స్ చేసిన ఆ 25 ఏళ్ల యువకుడు క్షణంలో ప్రాణాలను వదిలాడంటే నమ్మగలరా… డాన్స్ చేస్తూ స్టేజీపై కుప్పకూలిపోయిన ఆ యువకుడు ఇక మళ్లీ లేవలేదు. విగతజీవిగా మారాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో చోటు చేసుకున్న ఘటన ఇది. ఓ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఆ సంఘటనను కూడా డ్యాన్స్‌లో భాగంగానే చూశారు ఆ అమ్మాయి, ఇతర ప్రేక్షకులు. కొద్దిసేపటి తరువాత గానీ గుర్తించలేదు. ఆ యువతి అతణ్ణి లేపడానికి ప్రయత్నించింది. అప్పటికే అతను నిర్జీవంగా కనిపించాడు. కార్డియాక్ అరెస్ట్ రావడం వల్ల చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.



























