కొవిడ్-19 నిర్ధారణ పరీక్షను చాలా సులువుగా నిర్వహించడంతోపాటు బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కెనడా శాస్త్రవేత్తలు ఒక విధానాన్ని కనుగొన్నారు. స్మార్ట్ ఫోన్ కెమెరా సాయంతో చేపట్టే ఈ పరీక్ష వల్ల కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించొచ్చు.

కరోనా నిర్ధారణ పరీక్షలో.. నమూనాలను సేకరించడం, వాటిని ల్యాబ్‌కు పంపడం, పరీక్ష నిర్వహించడం, ఫలితాన్ని తెలియజేయడం వంటి అనేక దశలు ఉంటాయి. ఫలితంగా దీనికి చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఆధారిత క్వాంటమ్ బార్‌కోడ్ సీరోలాజికల్ ఆసే సాధనాన్ని టొరంటో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.



























