పాతతరం సినిమాల్లో విలన్ అంటే రాజనాల మాత్రమే గుర్తుకొచ్చేవారు. తన నటనలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆ పాత్రకే వన్నె తెచ్చారాయన. అయితే రాజనాల సినిమాల్లోలాగానే బయట కూడా అలాగే ఉంటారని చాలామంది అనుకునేవారట. దీంతో ఎక్కడికెళ్లినా కొంతమంది రాజనాలను చూసి పరుగెత్తేసేవారట. రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు.

దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా 400 కు పైగా చిత్రాల్లో పలు పాత్రలు పోషించి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు రాజనాల. తెలుగు సినిమా, నాటకాల్లో ఎక్కువగా నటించాడు. కొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు లాంటి ప్రతినాయక పాత్రలలో రాణించాడు.

1951లో రాజనాల మిత్రుడైన లక్ష్మీకుమార్‌రెడ్డి మద్రాసుకు రమ్మని పిలిచారు.. అప్పటికే లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్.ఎం.రెడ్డి వద్ద పని చేస్తున్నారు. ఆ సమయంలో వారు ‘ప్రతిజ్ఞ’ సినిమా కోసం విలన్‌గా రాజనాలను ఎంపిక చేసారు. 1953లో విడుదలైన ‘ప్రతిజ్ఞ’ సినిమా అద్భుతమైన విజయాన్ని అందించింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఎన్టిఆర్ తో ‘వద్దంటే డబ్బు’ అనే సినిమాలో నటించే అవకాశాన్ని పొందారు. ఆ సినిమాలో ఎన్టిఆర్ కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాఋ అప్పటికి అయన వయస్సు పాతికేళ్ళు. ఆ సినిమా చేసిన సమయం నుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు.

1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్’ అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందాడు. ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొట్ట మొదటి నటుడు రాజనాల.. ఎన్.టి.రామారావు, ఎం.జి.రామచంద్రన్ మరియు జె.జయలలిత ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్ళే.. రాజనాలాకు ఇతర సినిమా పరిశ్రమ కోలీవుడ్, బాలీవుడ్లలో మంచి స్నేహితులు ఉన్నారు.

రాజనాల, బాలకృష్ణ, సౌందర్య..

రాజనాల, నాగార్జున..

రాజనాల (పాత చిత్రం)

రాజనాల, జయలలిత (పాత చిత్రం)

రాజనాల, ఎన్టీరామారావు (పాత చిత్రం)

రాజనాల (పాత చిత్రం)



























