Connect with us

Featured

హీరోయిన్స్ ఎవరికైనా లైఫ్ టైం అంతే : తమన్నా భాటియా

Published

on

టాలీవుడ్‌లో తమన్నా భాటియా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్..ముఖ్యంగా ముంబై లేదా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు మహా అయితే మూడు నాలుగు సినిమాలు చేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఓ పది పదిహేనేళ్ళు ఇండాస్ట్రీలో..అది కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇక్కడ సక్సెస్ రాకపోతే హీరోయిన్స్ ని అంతగా పట్టించుకోరు. పైగా రెండు ఫ్లాపులొస్తే ఐరెన్ లెగ్ అని అంటారు. హీరో ముసలివాడైన తర్వాత కూడా హీరో వేషాలు వేయడానికి రెడీగా ఉంటారు. కానీ హీరోయిన్ విషయంలో అలా ఉండదు.

ఇదే మాట తమన్నా కూడా చెబుతోంది. టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంటరయింది. ఇందులో సమీర్ అఫ్తాబ్ కి జంటగా నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. కానీ లక్కీగా అదే సంవత్సరం మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది.

ఇలా తమన్నా అటు హిందీ ఇటు తెలుగులో నటించిన డెబ్యూ సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇక 2006లో జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆయన తమ్ముడు రవికృష్ణ కి జంటగా కేడీ సినిమాతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఇలియానా మరో హీరోయిన్ గా నటించింది. ఇందులో తమన్నా నెగిటివ్ పాత్రను పోషించింది. ఆ సినిమా కూడా ఫ్పాయింది. ఆ తర్వాత తమిళంలో ఎస్.జె. సూర్య కి జంటగా వ్యాబారి సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే టాలీవుడ్ లో తమన్నా 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన హ్యాపీ డేస్ సినిమాతో భారీ హిట్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సాధారణంగా ఒక భాషలో ఫ్లాపయితేనే మళ్ళీ ఆ హీరోయిన్ గురించి పట్టించుకోరు. అలాంటి మూడు సినిమాలూ మూడు భాషలలో నటించగా ఫ్లాపయినప్పటికీ తమన్నా కి లక్ బాగా ఫేవర్ చేసి స్టార్ హీరోయిన్ అయింది. ఇక 2009లో కిషోర్ కుమార్ పార్దాసాని దర్శకత్వంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం తమన్నాకి మరో సూపర్ హిట్ ఇచ్చింది. ఇందులో సిద్దార్థ్ హీరో. అలాగే మెగా పవర్ స్టర్ రాం చరణ్ తో రచ్చ చేసింది. ఇలా వరుసగా ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ సహా హిందీ, తమిళ సినిమాలలో నటించి విపరీతమైన స్టార్ డం తెచ్చుకుంది.

అయితే హీరోయిన్స్ కి అవకాశాలు వచ్చినప్పుడే చేసుకోవాలి. లేదంటే గట్టి పోటీ ఉండే సినిమా ఇండస్ట్రీలో తట్టుకొని నిలబడటం కష్టమని చెప్పుకొచ్చింది. తమిళ ప్రేక్షకులను
హీరోయిన్ బొద్దుగా ఉండాలి. లేదంటే ఆమెను చూడటానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ ఇది తమన్నా విషయంలో రివర్స్ అయింది. ఆమె నాజూకుగా ఉన్నా అక్కడి వాళ్ళు తనని ఆదరించారు.  ఎక్కడైనా నంబర్ వన్ అనేది కొంతకాలమే ఉంటుంది. ఆ తర్వాత ఎవరో ఒకరు వచ్చి స్టార్ డం తెచ్చుకుంటే దానికి మనం ఏం చేయలేము. హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఆ తర్వాత వచ్చేవన్నీ అక్క, వదిన పాత్రలే. మనకి క్రేజ్ ఉన్నప్పుడే హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయి.. అది మనకి నచ్చితే చేస్తాము లేదంటే లేదు అని తమన్నా చెప్పుకొచ్చింది. 

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్.. ముహూర్తం ఫిక్స్ చేసుకున్న జనసేనాని!

Published

on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన వచ్చే ఎన్నికలలో ఏ విధంగా అయినా గెలవాలన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఒంటరిగా పోరాటం చేయకుండా తెలుగుదేశం బిజెపితో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాలలో మాత్రమే కాకుండా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే స్థానాలలో కూడా పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి ఈయన రోడ్డు షోలలో పాల్గొంటున్నారు.

ఇక ఈనెల 18 నుంచి నామినేషన్స్ కూడా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 23వ తేదీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ నామినేషన్ కి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది.

Advertisement

ప్రారంభమైన నామినేషన్లు..
నామినేషన్ దాఖలు చేసిన రోజు సాయంత్రమే ఈయన ఉప్పాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. నామినేషన్ ప్రక్రియలు ప్రారంభం కావడంతో పలువురు నామినేషన్స్ వేశారు మొదటి రోజు అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Advertisement
Continue Reading

Featured

Ramcharan: రామ్ చరణ్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నిజం కాదా… ఇంత పెద్ద మోసం చేశారా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ తండ్రికి మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు.

ఇక రాంచరణ్ సినిమాలలో రంగస్థలం సినిమా కూడా ఓ మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈయన నటన అద్భుతం అని చెప్పాలి సుకుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక సాధారణ వ్యక్తి లాగా సైకిల్ తొక్కుతూ ఎంట్రీ ఇచ్చారు ఈ విషయం గురించి సుకుమార్ గారికి ఒక ప్రశ్న ఎదురైంది.

ఇలా ఒక స్టార్ హీరోని ఇంత సింపుల్గా చూపించడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మీలో కలగలేదా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ..కథకి అనుగుణంగా ఒక వ్యక్తి ఏదో వెతుక్కుంటూ వెళతాడు. ఆ రోజుల్లో వాహనం అంటే సైకిల్.. అందుకే సైకిల్ లో చూపించా.లాంగ్ షాట్ లో వంతెనపై సైకిల్ తొక్కుతూ కనిపించాలి. ఆ తర్వాత టాప్ యాంగిల్ లో చూపిస్తూ నెమ్మదిగా రాంచరణ్ ముఖం దగ్గరికి కెమెరా రావాలి. కాబట్టి ఫ్లైయింగ్ కెమెరా వాడాం.

Advertisement

నాలుగైదు టేకులు..
నాలుగైదు టేకులు చేసిన మంచిగా రాకపోవడంతో ఇక ఈ ఇంట్రడక్షన్ సీన్ సీజీ వర్క్ లో పూర్తి చేశాం అని సుకుమార్ చెప్పారు. అవునా అది సీజీ షాటా అని ఆశ్చర్యపోయారు. రాంచరణ్ సైకిల్ తొక్కుతున్నది మాత్రం రిఫరెన్స్ గా తీసుకుని ఆ సీన్ ని సీజీ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సినిమాలో ఇంకా కొన్ని సీజీ షాట్స్ ఉన్నాయి. కానీ ఎవరూ గుర్తు పట్టలేరు అని సుకుమార్ నవ్వేశారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Venu: బాహుబలి సినిమా చేస్తున్నావా.. వేణు ఇన్ని అవమానాలు పడ్డారా?

Published

on

Venu: జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈయన బలగం అనే సినిమా ద్వారా దర్శకుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను కూడా అందుకున్నాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో స్పష్టంగా తెలుస్తుంది. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు తదుపరి సినిమా నానితో చేసే అవకాశాన్ని అందుకున్నారు త్వరలోనే వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన విషయాలు తెలియచేయబోతున్నారు.

ఇలా దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నటువంటి వేణు మరొక కమెడియన్ ధనరాజ్ తో కలిపి ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది ఈ ప్రోమోలో భాగంగా బలగమా సినిమా గురించి ప్రశ్నలు వేశారు.

Advertisement

ఈ సందర్భంగా వేణు సమాధానం చెబుతూ తాను బలగం సినిమా షూటింగ్ సమయంలో కొంతమంది టెక్నీషియన్ లతో మాట్లాడుతూ ఉండగా కొందరు నన్ను అవమానపరిచారని తెలిపారు. ఏదో పెద్ద బాహుబలి సినిమా చేస్తున్నావా ఏంటి అంటూ అవమానించారని వేణు తెలిపారు.

చిన్న సినిమాలలో బాహుబలి..
ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మీరు ఈ సినిమాపై స్పందిస్తూ చిన్న సినిమాలలో బాహుబలి అంటూ కామెంట్స్ చేయడం తను ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఈ సందర్భంగా వేణు చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!