ఈ హీరో చిన్న బడ్జెట్ సినిమాలకు రారాజులా వెలిగాడు. ‘సిక్స్టీన్’ సినిమాతో ఎంటర్ అయిన ఈ హీరో తరవాత ‘గర్ల్ ప్రెండ్’ ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ తరవాత రోహిత్ కు ఆఫర్లు తగ్గి, ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాల్సి వచ్చింది. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో రోహిత్ నటించిన పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల మదిలో ఉంది. చివరిగా 2010 లో మా అన్నయ్య బంగారం లో కనిపించి ఆ తరవాత కనిపించడం మానేసాడు. రోహిత్ ఖాతాలో ఒక్క మాస్ హిట్ కూడా లేదు. దీనితో రోహిత్ పూర్తిగా సినిమాలకి దూరం అయ్యాడు.

అయితే స్టార్ హీరోగా ఎగుతున్నాడు అనుకున్న సమయంలో టాలీవుడ్ లోకి నటవారసులు అడుగుపెట్టడంతో వాళ్ళ ధాటికి తట్టుకోలేకే అయన సినిమాలకు దూరమయ్యాడనే ప్రచారం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో అయన మాట్లాడుతూ.. తనకి సినిమా అవకాశాలు ఎందుకు రాలేదు అన్నదానిపై స్పందించారు ” నేను డైరెక్టర్, బ్యానర్ కంటే.. సినిమా స్క్రిప్ట్ నే ఎక్కువగా నమ్ముతాను. స్క్రిప్ట్స్ బాగుంటే మాత్రమే ఆ సినిమా చేసేందుకు ఇష్టపడతాను. ఆ సమయంలో నాకు చాలా డైరెక్టర్స్ సినిమా కథలు వినిపించారు. కానీ నేను కథ బాగుంటే బాగుందని లేకపోతే లేదని చాలా ఓపెన్ గా మొఖం మీదే చెప్పేవాడిని.. ఇలా మొఖం మీద చెప్పడం వల్ల అది నాకే చాలా బ్యాడ్ అయిపొయింది. అలా నాకు సినిమా అవకాశాలు రావడం తగ్గిపోయయాయి” అని రోహిత్ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు హీరో రోహిత్. తాజగా రోహిత్ హీరోగా వస్తున్న ‘కళాకార్’ అనే సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. శ్రీను బందెల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తీ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. పూర్తీ స్థాయి థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ డేట్ ప్రకటించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కరోనా నేపధ్యంలో అనేక భారీ బడ్జెట్ సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ఇటువంటి సమయంలో చాలా కాలం గ్యాప్ తరువాత వస్తున్నా రోహిత్ సినిమాకు దియేటర్స్ దొరుకుతాయా అంటే అనుమానమే.. ఏది ఏమయినా సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా తను ఆశించిన స్థాయికి వెళ్లాలని కోరుకుందాం..



























