నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాల పేర్లు వినిపిస్తే లవర్ బాయ్ సిద్దార్థ్ మన కళ్ల ముందు మెదులుతాడు. తెలుగులో ఈ రెండు సినిమాలు మినహా పెద్దగా సక్సెస్ లు లేని సిద్దార్థ్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు అభిమానిస్తారు. అయితే ఒకప్పుడు హిట్టూఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసిన సిద్దార్థ్ గత కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇండస్ట్రీలో వరుస ప్లాప్ లు ఎదురవడంతో అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైన సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ సినిమా విషయాలనే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ చేసిన ట్వీట్లు పలు వివాదాలకు కారణమయ్యాయి.

ఇక తాజగా ఒక యూట్యూబ్ ఛానల్ తన థంబ్ నైల్ లో సిద్ధార్థ్ చనిపోయారంటూ ఓక ఫోటో పెట్టడం దుమారం రెంగుతుంది. దీనితోపాటూ అతి చిన్న వయసులో చనిపోయిన సౌత్ ఇండియన్ స్టార్స్ అంటూ టైటిల్ పెట్టి అందులో చనిపోయిన సౌందర్య, ఆర్తి అగర్వాల్ ఫొటోలతో పాటు సిద్ధార్థ్ ఫోటో కూడా ఉంచారు. అయితే ఇది గమనిచిన ఓ మరమనిషి అనే ఇంస్టాగ్రామ్ పేజీ దీనిపై మీమ్స్ చేసింది. ఆ మీమ్ ని సిద్దర్ద్ అభిమాని ఒకరు ఆ హీరో సిద్ధార్థ్ కి ట్యాగ్ చేసారు.. వ్యూస్ కోసం యూట్యూబ్ వాళ్ళు మరీ ఇంతలా దగజారాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక అభిమాని చేసిన ఈ ట్వీట్ పై సిద్దార్థ్ స్పందించారు. “నేను చనిపోయానంటూ చేసిన ఈ వీడియోపై చాలా కాలం క్రితమే ఆ యూట్యూబ్ చానల్ కి పిర్యాదు చేసాను. అయినా వాళ్ళు ఆ విడియోలో ఇబ్బందికర అంశం ఏమీ లేదు అంటూ సమాధానం ఇచ్చారు.. ఇది జరిగి చాలా ఏళ్లయింది.” అంటూ కామెంట్ చేశారు సిద్దార్థ్. తాజగా శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్న ‘మహాసముద్రం’ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రైట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు సిద్దార్థ్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..
I reported to youtube about this video claiming I'm dead. Many years ago.
— Siddharth (@Actor_Siddharth) July 18, 2021
They replied "Sorry there seems to be no problem with this video".
Me : ada paavi ???? https://t.co/3rOUWiocIv



























