కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. చాపకింద నీరులో వ్యాపిస్తోంది. తాజాగా ఈ మాయదారి వైరస్ బారిన పడి ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్టు గ్రహీత శివ శంకర్ మాస్టర్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్ గా అత్యున్నత శిఖరాలు అందుకున్న శివ శంకర్ మాస్టర్ వారం రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డారు.

ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తుండగా.. మరణించాడు. అతడికి సినీ పరిశ్రమ నుంచి ఎంతో మంది ఆర్థిక సహాయం చేశారు. అయినా అతడి ప్రాణాలు నిలవలేదు. ఆయన పది భాషల్లో 800కు పైగా చిత్రాలను పని చేసిన అనుభవం ఉంది. అటువంటి సీనియర్ కొరియోగ్రాఫర్ ను ఈ సినీ పరిశ్రమ కోల్పోవడం ప్రతీ ఒక్కరికీ షాక్ ను గురి చేసింది.
అతడు నటుడిగా కూడా 30కి పైగా చిత్రాలలో నటించారు. మగధీర సినిమాలో ధీర ధీర సాంగ్ కి గాను ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. బాహుబలి 1 సినిమాకు అతడు చివరి సారిగా కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఇక.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మృతదేహానికి నేడు మధ్యాహ్నాం 2 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అంతకుముందు మణికొండ పంచవటి కాలనీలోని తమ నివాసంలో అభిమానుల సందర్శనార్థం శివశంకర్ మాస్టర్ మృతదేహాన్ని ఉంచి నివాళులర్పించనున్నారు. ఇక్కడ చెప్పుకునే విషయం ఏంటంటే..
శివశంకర్ మాస్టర్ చనిపోయేముందు కొవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ చేశారు ఏఐజీ వైద్యులు. ఇప్పటికే వైద్య అధికారులు అతడి భౌలిక ఖాయన్ని కుటుంబసభ్యలకు అప్పటించారు. మరి కొద్ది సేపట్లో అతడి అంత్యక్రియలు జరగనున్నాయి.





























