ఆసక్తికర సందర్భాలు బయటనే కాదు సినిమాల్లో కూడా జరుగుతాయి. కానీ నిజ జీవితంలో జరిగే అనేక సంఘటనలను ఆధారం చేసుకుని సినిమాలను రూపొందించడం సర్వ సాధారణం.


సినీ చరిత్రలో హీరోలు ఒకే సంవత్సరంలో అనేక సినిమాల్లో నటించడం వలన తమ సినిమాలు కొన్ని ఒకే రోజు విడుదలవడం మనం చూశాం. కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి లాంటి వారికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది. కానీ ఒకే కథతో ఉన్న రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవ్వడం ఆసక్తికర విషయం. ఇది యాద్రుశ్చికమా లేక విధివంచితమో అర్థం కాదు.

1989 సంవత్సరంలో బాలకృష్ణ ముద్దుల మావయ్య సినిమా ఇండస్ట్రీ హిట్ తో జోరు మీదున్నాడు. ఇదే సంవత్సరంలో ఆయన నటించిన అశోక చక్రవర్తి సినిమా కూడా విడుదలైంది. కాకపోతే అశోక చక్రవర్తి డిజాస్టర్ కాగా అదేరోజు విడుదలైన ధ్రువ నక్షత్రం సూపర్ హిట్ అయింది.

మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఆర్యన్ మూవీ పెద్ద హిట్ అవడంతో అశోక చక్రవర్తి నిర్మాతలు మూడు లక్షలకు ఆర్యన్ చిత్ర రీమేక్ హక్కులను కొనుక్కొని, బాలకృష్ణను హీరోగా పెట్టి అశోక చక్రవర్తి సినిమా 1989 జూన్ 29న విడుదల చేశారు. ఈ సినిమా ఫెయిల్యూర్ కాగా ఇదే తేదీన వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే ఒకే రోజు ఒకే కథతో విడుదలైన ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ కథా రచయితలు. ఒకే కథతో రెండు సినిమాలు చేస్తున్నప్పుడు రచయితలు పరుచూరి బ్రదర్స్ రహస్యంగా ఉంచుతూ ఏమి చెప్పకపోవడం గురించి అశోక చక్రవర్తి నిర్మాతలు అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం ఆ రోజుల్లో చర్చనీయాంశమయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here