సాధారణంగా చేపలు కిలో 100, 200 మధ్యలో ఉంటాయి. అదే కొర్రమీను చేప అయితే 500 నుండి 700 వరకు పలుకుతూ ఉంటాయి. ఇక పులస చేప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దీని ధర కిలో వేల రూపాయల లో ఉంటుంది. అయితే ఈ ప్రత్యేకమైన కచడి చేప ధర ఏకంగా లక్షల్లో అమ్ముడు పోతుంది. అయితే ఈ చేప యొక్క ప్రత్యేకత ఏమిటి? దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

మన తెలుగు రాష్ట్రాలలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రతి ఒక్క వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. నదులు నిండుగా ఉండడంతో, చేపలు పుష్కలంగా లభిస్తున్నాయి. దీనితో మత్స్య సంపద కు అనేక లాభాలు కలుగుతున్నాయి. తీర ప్రాంతాలలో దొరికే పులస చేపకు ఈ సీజన్లో భలే గిరాకీ ఉంటుంది. అయితే నదులలో దొరికే ఈ చేప కే ఇంత డిమాండ్ ఉంటే, సముద్రంలో లభించే అత్యంత అరుదైన కచడి చేప కు డిమాండ్ భారీగా పెరిగి పోతుంది. ఈ ఒక్క చేప దొరికిన, మత్స్యకారుల యింట కాసుల పంట పండుతుంది. ఒక్కో చేప ధర అక్షరాల లక్షలలో పలుకుతుంది. అంత డిమాండ్ ఉన్న ఈ చేప ఎంతో అరుదుగా మత్స్యకారుల వలలో దొరుకుతుంది.
గత రెండు వారాల క్రితం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు లో సముద్రంలోకి వేటకు వెళ్ళిన ఓ మత్స్యకారుడి వలలో 28 కిలోల కచడి చేప దొరికింది. సాధారణంగా ఈ చేపలు దాదాపు 200 కిలోల వరకు బరువు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ చేపను కొనేందుకు ఎంతోమంది ఎగబడ్డారు. చివరికి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి లక్షల 70 వేల రూపాయలు చెల్లించి ఆ చేపను తన సొంతం చేసుకున్నాడు.
ఈ చేప యొక్క ప్రత్యేకత ఏమిటి? అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఈ చేపలు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ చేప నుంచి వచ్చే దారాన్ని సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్టు వేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆల్కహాల్ తయారు చేయడానికి, ఈ చేప రెక్కలు వైన్స్ శుభ్రం చేయడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంతే కాకుండా ఎన్నో సౌందర్యసాధనాల లో ఈ చేపను ఉపయోగిస్తారు. అయితే ఈ చేప సముద్రంలో ఒకచోట నుంచి మరొక చోటుకు సుదీర్ఘ ప్రాంతాలకు పయనిస్తూ ఉండడంవల్ల, ఇది దొరకడం అరుదుగా కనిపిస్తుంటుంది. అయితే ఈ చేప దొరికిన వారు, లక్షాధికారులు అవ్వడం నిజం.



























