తాజగా మెదక్‌లో మరో బారుబావి ఘటన చోటుచేసుకుంది. మృత్యు కుహరాల్లా నోళ్లు తెరిచిన బోరుబావులకు పసిపిల్లలు ఇంకా బలవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది పిల్లలు చనిపోతున్నా వ్యవస్థలో మార్పు రావడంలేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోద్చన్ పల్లిలో మూడేళ్ళ బాలుడు బోరు బావిలో పడ్డాడు. పొడ్చన్‌పల్లి గ్రామంలో సాయివర్ధన్ అనే మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

ఈరోజు సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటానా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నీరు రావడం లేదని 120 అడుగులు తవ్విన యాజమాని దాన్ని కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వదిలేసాడు. అప్పటినుంచి ఆ భావి అలానే ఉంది. తాడు సాయంతో పైకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో బోరుబావికి సమాంతరంగా పొక్లైనర్‌లతో గొయ్యి తవ్వుతున్నారు. 120 అడుగుల లోతున్న ఈ బోరుబావిలో బాలుడు ప్రస్తుతం 20 అడుగుల లోతులో చిక్తకుకున్మనట్టు సమాచారం. ఘటనపై చిన్నారి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




























