Kommineni : వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నానని న్యాయమూర్తికి విన్నవించిన కొమ్మినేని శ్రీనివాసరావు. తనకు 70 ఏళ్లు పైబడిన వయస్సు ఉండటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, కాబట్టి జైలులో బెడ్ సౌకర్యం కల్పించాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఐతే, న్యాయమూర్తి స్పందిస్తూ.. “నిబంధనల ప్రకారం అందరికీ బెడ్ ఇస్తే మీకూ ఇస్తాం” అని బదులిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనల ప్రకారమే బెడ్ కేటాయింపు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పొన్నవోలు వాదనలు: న్యాయమూర్తి అసంతృప్తి
కొమ్మినేని తరపున న్యాయవాది పొన్నవోలు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. కొమ్మినేని వయస్సు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బెడ్ కేటాయించాలని కోరారు. అయితే, పొన్నవోలు వాదనలపై న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
అట్రాసిటీ కేసు: DSPకి మెమో జారీ
కొమ్మినేనిపై అట్రాసిటీ కేసు నమోదుపై DSPకి మెమో జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.



































