ఏదైనా మనకు అవసరం పడినప్పుడు సమయానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం.. ఏటీఎంలోకి వెళ్లి డ్రా చేసుకొని ఆ పని చూసుకుంటాం. ఒకవేళ ఏటీఎం సెంటర్ వద్ద జనాలు ఎక్కువగా ఉండి.. క్యూ ఎక్కువగా ఉంటే ఏం చేస్తాం.. ఎంత సేపైనా ఓపికతో ఉండి ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి డబ్బులను తీసుకుంటాం.

ఇలా ఏటీఎం సెంటర్ లోకి వెళ్లి కార్డును స్వైప్ చేసి.. ఏటీఎం స్క్రీన్ల మీద కనిపించే ఆప్షన్లను క్లిక్ చేస్తూ ఉంటారు ప్రతీ కస్టమర్. అయితే భయట అంత సేపు వెయిట్ చేసిన అతడు.. లోపల ఒక్కోసారి డిస్ ప్లే అవ్వడానికి టైం తీసకుంటుంది. స్వైప్ చేసిన దగ్గర నుంచి డబ్బులు తన చేతిలో పడేంత వరకు ఎంత సమయం పడుతుందో తెలుసా.. అక్కడ కస్టమర్ ఎంత సమయం వరకు ఓపికతో ఉంటాడో తెలుసా.. ఈ విషయాలపై ఆర్బీఐ ఓ సర్వే నిర్వహించి వెల్లడించింది.
దీనిలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వాటిని ఇక్కడ తెలుసుకుందాం.. ఏటీఎంలో కార్డ్ స్వైపింగ్ మొదలు డబ్బు బయటికి వచ్చేవరకు అంతా ఆటోమెటిక్‌గా సాగుతుంది. ఓక్కో సమయంలో కొద్దిగా సమయం ఎక్కువగా తీసుకోవచ్చు. కార్డ్ స్వైపింగ్ చేసిన ఏడు సెకన్ల లోపు ట్రాన్సాక్షన్ మొదలు కావాల్సిందే.
దానికి ఒక్క సెకన్ లేటయినా.. కస్టమర్ తిట్టడమో.. లేదా ఏటీఎంను తన్నడమో చేస్తుంటాడు. లేదా సీసీ కెమెరాల వంక చూసుకుంటూ నానా బూతులు తిడతారట. ఇది ఆర్బీఐ నిర్వహించిన సర్వేలో తేలిందట. ఏటీఎం, ఇతర నెట్‌వర్క్‌లలో ఏదైన సమస్య ఉంటే మాత్రం ఆలస్యం అవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.





























