ప్రస్తుతం టెక్నాలటీ ఎంతో దూసుకుపోతోంది. అంతరిక్షంలోకి కూడా మనుషులు వెళ్తున్నారు. ఇతర గ్రహాలపై కూడా రాకెట్లను పంపుతున్న రోజులివి. ఇలాంటి రోజుల్లోకూడా మూఢ నమ్మకాలు ఆగడం లేదు. నమ్మే వాళ్లు ఉంటే.. నమ్మించేవారు ఉంటూనే ఉంటారు. ఘోరం ఏంటంటే.. చదువుకున్న మూర్ఘులు కూడా ఈ ముఢనమ్మకాలను నమ్మేస్తున్నారు. క్షద్రపూజల పేరుతో మనిషిని బలి తీసుకున్న ఘటనలు మనం వింటూనే ఉన్నాయి.

అలాంటి ఘటనే ఒకటి బిహార్ లో వెలుగు చూసింది. బిహార్ లోని ముంగేర్ జిల్లాలో దిలీప్ కుమార్ కు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అతడి భార్య గర్భం దాల్చడం.. కొన్ని రోజులకు అబార్షన్ కావడం జరుగుతంది. ఇలా బార్యకు వరుసగా అబార్షన్లు అవుతున్నాయని.. అతడు ఓ రోజు తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. దానికి అతడు ఏం సలహా ఇచ్చాడో తెలుసా.. అలా జరగకుండా ఉండాలంటే మైనర్ బాలికను బలివ్వాలని చెప్పాడు.
దీంతో మీ భార్య గర్భం నిలిచి.. పండంటి బిడ్డకు జన్మనిస్తుందని తెలిపాడు. అనుకున్నట్లుగానే ఆగస్టు 4న ఓ బాలిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. అతడు ఆమెను ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసి ఆ బాలికను బలిచ్చాడు. ఆమె కళ్లు పీకేసి.. రక్తంతో క్షుద్రపూజలు చేశాడు. తర్వాత ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు.
పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా దిలీప్ కుమార్ వ్యవహారం బయటపడింది. అతడిని అరెస్ట్ చేసి తమ దైన స్టైల్లో విచారించారు. దీంతో దీనికి కారణం అయిన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధిత మహిళ కుటుంబసభ్యులు తమ కూతురును నరబలి కోసం హత్య చేయలేదని.. అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.





























