వీడియో వైరల్: కప్పను గాలిలోకి ఎగరేసుకుపోయిన కందిరీగ… చివరికి ఏమైందంటే?

0
275

కప్పకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే కప్ప ఒకచోట ఉండి అటువైపుగా వస్తున్న కీటకాలను దాని నాలుకతో పట్టుకొని తినే వరాన్ని ప్రసాదించింది. సాధారణంగా కప్పలు ఈ విధంగానే కీటకాలను వేటాడుతూ తింటాయి. కానీ కీటకాలు కప్పలను ఎగరేసుకుపోవడం బహుశా ఎప్పుడు విని ఉండము. అయితే ఈ వీడియోలో మాత్రం కీటకం కప్పను గాలిలోకి ఎగరేసుకుపోయిన సన్నివేశం చూడవచ్చు.

సాధారణంగా కప్పలు కీటకాలను తినడం చూశాము. కానీ కీటకాలు కప్పులను ఎత్తుకుపోవడం ఎప్పుడు చూసి ఉండరు.అయితే తాజాగా ఒక కీటకం కప్పను గాలిలోకి ఎగరేసుకు పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేమి చోద్యం.. కందిరీగ కప్పని గాలిలోకి ఎగరేసుకుపోవడం ఏంటి ..ఈ వింత అంటూ ఆశ్చర్యపోతున్నారు.

సుశాంత్ నంద అనే ఫారెస్ట్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక కొలను గట్టున కూర్చొని ఉంది. అటుగా వస్తున్నటువంటి ఒక కందిరీగను తన నాలుకతో పట్టుకోవడానికి ప్రయత్నించింది.ఈ క్రమంలోనే కప్ప నాలుకతో కీటకాన్ని పట్టుకోగా ఆ కీటకం కప్ప నుంచి రక్షించుకోవడానికి తన రెక్కలను గట్టిగా కొడుకు గాలిలోకి ఎగిరింది.

ఈ విధంగా కందిరీగ కప్ప నుంచి తప్పించుకోవడానికి బలంగా ప్రయత్నించడంతో ఏకంగా ఆ కప్ప కూడా గాలిలోకి ఎగిరింది. బహుశా ఇలాంటి వింత దృశ్యాన్ని ఇది వరకు మనం ఎప్పుడు చూసి ఉండము. ఈ అద్భుతమైన ఘటనను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చివరకు ఆ కప్ప ఏమైంది.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు తమ ఊహాగానాలకు అందిన విషయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ వీడియోని చూసి చివరికి ఆ కప్ప ఏమైందో కామెంట్ రూపంలో తెలియజేయండి.