Aacharya film producer : ఏపీ సీఎం జగన్ రాజ్యసభ ఎంపీలుగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న విషయానికి తెరదించుతూ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ లతో సుదీర్ఘ భేటీ తరువాత నలుగురు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఆల్రెడీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డిని మళ్ళీ రాజ్యసభ మెంబెర్ గా కొనసాగిస్తూ, మిగిలిన మూడు స్థానాలకు గాను ఇద్దరు బీసీ, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. విజయసాయి రెడ్డి తో పాటు, ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన బీద మస్తాన్ రావు ఇక ప్రొడ్యూసర్ మరియు న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు.

ఆచార్య ప్రొడ్యూసర్ కు రాజ్యసభ సీటు….
ఇక ఇపుడు అందరి చూపులు నిరంజన్ రెడ్డి వైపే. జగన్ రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు తెలియగానే అందరి దృష్టి ఆచార్య ప్రొడ్యూసర్ పైనే ఉంది. నిరంజన్ రెడ్డి ది తెలంగాణ, నిర్మల్ ప్రాంతం. నిరంజన్ ఏపీ సీఎం జగన్ కు సిబిఐ కేసులు వాదించే వ్యక్తిగత న్యాయవాది. ఇక ఈయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆచార్య లాంటి భారీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ అంతకుముందు కూడా క్షణం, ఘజీ, వైల్డ్ డాగ్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలను ప్రొడ్యూసర్ చేసారు. 2011 నుండి జగన్ అక్రమ ఆస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్నారు.

1970 జూలై 22 వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్ తన న్యాయవాద విద్యను పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల కోర్సు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ న్యాయవాదులైన మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిల వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సినిమాలపై మక్కువతో నిర్మాతగా మారారు. ఇక ఈయన స్థానంలో తొలుత కమెడియన్ అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్న నిరంజన్ రెడ్డికి సీటు దక్కింది.



































