Aamani : సహజమైన తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని సగటు ఇల్లాలి పాత్రలలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ ఆమని. హీరోయిన్ గా మంచి పాత్రలను చేసి తన నటనను నిరూపించుకున్న ఆమని ప్రస్తుతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూ, అటు బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవలే ఎమ్సీఏ, చావు కబురు చల్లగా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాలలో నటించింది. ఇక బుల్లితెర మీద అటు రియాలిటీ షోకి అప్పుడప్పుడు జడ్జి గా వ్యవహారిస్తూ, ఇక సీరియల్స్ కూడా నటిస్తూ అలరిస్తున్న ఆమని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.

గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు…
ఆమని తెలుగమ్మాయి అయినా కూడా తల్లిదండ్రులు బెంగళూరులో స్థిరపడటంతో అక్కడే పెరిగారు. తండ్రి కూడా సినిమా ఇండస్ట్రీ లో ఉండటంతో సినిమాల మీద ఆమని కి ఆసక్తి పెరిగింది. ఇక తండ్రి డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల సినిమాల్లో నటించాలని ఆమని అనుకున్నారు. ఇక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించింది. అవకాశాల కోసం వెళ్లిన మొదట్లో అడిషన్ కోసం వెళితే రేపు వచ్చి గెస్ట్ హౌస్ లో కలవమని చెప్పారట. అది కూడా ఒంటరిగా రమ్మనడం తో వాళ్ళు ఏ ఉదేశ్యం తో పిలుస్తునానరో అర్థమైంది అని, అప్పట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితుల గురించి చెప్పింది. అయితే ఆమని అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా సినిమాలకు దూరం అవ్వలేదు.

బాపు, కే విశ్వనాధ్ వంటి లెజెండరీ దర్శకుల చేత శభాష్ అనిపించుకునే నటన ప్రదర్శించింది. ఇప్పటికే ఇండస్ట్రీ లో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి చాలా మంది తారలు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి నిర్భయంగా చెప్తున్నారు. బయటి నుండి వచ్చిన వారైనా, లేక ఇండస్ట్రీ కి వచ్చిన వారైనా క్యాస్టింగ్ కౌచ్ కి అతీతులు కాదు. తమిళ నాట శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలాంటివి ఎదుర్కొన్నట్లు తెలపడం అందరినీ షాక్ కి గురిచేసింది.



























