Aamir Khan : ఒక్కసారి నోరు జారితే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేము. జరిగే నష్టాన్ని ఆ ఆతరువాత ఎంత సంజాయిషీ చెప్పినా ఆపలేము. సరిగ్గా ఇప్పుడు ఇలానే ఓ బాలీవుడ్ హీరో విషయంలో జరుగుతోంది. ఎప్పుడో చేసిన వాఖ్యల తాలూకు వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతూ తలనొప్పి తెచ్చిపెట్టింది. ఆ హీరో అప్పుడేదో మాట్లాడాను వదిలేయండ్రా నాయనా అన్నా కూడా నెటిజన్స్ మాత్రం ఆగడంలేదు. ఆ హీరో సినిమా విడుదల సమయంలో ట్విట్టర్ లో సదరు హీరో సినిమా చూడొద్దంటూ ట్రెండ్ చేస్తున్నారు.

ఇండియా ని ప్రేమిస్తున్నాను…
అమీర్ ఖాన్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుంది. మంచి సినిమాలను తీస్తూ సినిమా కోసం బాగా కష్టపడే అమీర్ ఖాన్ కు ఇపుడు పెద్ద కష్టం వచ్చిపడింది. అమీర్ ఖాన్ తాజాగా నటించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాను చూడొద్దంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. అసలు ఇంతలా అమీర్ ఏం చేసాడు, లేదా సినిమాలో వివాదాస్పద విషయాలు ఏమున్నాయో అంటే అది సినిమాకు సమబంధించిన విషయమే కాదు. అమీర్ ఖాన్ చేసిన వాఖ్యల తాలూకు ఫలితం.

Don't waste money on watching #LaalSinghChaddha feed needy person with that money.#BoycottBollywood#BoycottLaalSinghChaddha pic.twitter.com/GsgUgNjm6k
— Indian (@Indian_101) July 25, 2022
అది కూడా ఇప్పుడు కాదు 2015 లో చేసిన కామెంట్స్. 2015 లో ‘ఇంటోలేరెన్స్’, అసహనం పేరిట బాగా చర్చ జరిగిన రోజుల్లో దేశంలో అసహనం పెరుగుతోందంటూ చాలా మంది మాట్లాడారు. అదే సమయంలో అమీర్ ఖాన్ కూడా “ఇండియా లో భద్రత లేదు.. నాకు ఇండియాలో బ్రతకాలనిపించడం లేదు” అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ కామెంట్స్ ను ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చద్ధ’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. ఇక దీనిపై అమీర్ ఖాన్ మీడియా తో స్పందించారు. బాయ్ కాట్ గురించి మాట్లాడుతూ అది చాలా బాధ కలిగించే విషయం అలా చేస్తున్న వారు నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఇండియా అంటే ఇష్టం లేదని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అది నిజం కాదు, దయచేసి సినిమాను చూడండి అని చెప్పారు.































