ఆకట్టుకుంటున్న `పీన‌ట్ డైమండ్` టీజర్.. డైలాగ్స్ హైలైట్..!!

0
93

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న చిత్రం `పీన‌ట్ డైమండ్`. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుంది. అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌ ప్ర‌ధాన పాత్ర‌లలో నటించారు.ప్రొడ‌క్ష‌న్ నెం.1గా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు.

భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ ని టాలీవుడ్ టాప్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.. కాగా ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. టీజర్ ని బట్టి ఈ సినిమా సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామా అని తెలుస్తుంది. ఆదిలోనే ఓ పాప అతను విజయం సాధిస్తాడా అని అడగగా ఓ వాయిస్ అతనికి దక్కేది విజయమా, మరణమా అనేది అతను ఎంచుకునే మార్గాలని బట్టి ఉంటుందనే డైలాగ్ ఎంతో క్యూరియాసిటీ ని పెంచుతుంది.. టీజర్ లో అభినవ్ సర్దార్ ఎంతో ప్రమోసింగ్ గా కనిపిస్తున్నారు. రామ్ కార్తీక్ పాత్ర కూడా ఎంతో వైవిధ్యం గా ఉంది.. చూడబోతే ఈ సినిమా లో డైలాగ్స్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లుంది అనిపిస్తుంది.

ఓ రెండు సంఘటనలు ఒకేరోజు చోటు చేసుకున్నాయి అనే డైలాగ్, అందరు వజ్రాల వేటకు వెళితే అతని అడుగులు మాత్రం వేరే వైపు వెళ్లాయి అనే డైలాగ్ సినిమా పై ఆసక్తి ని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. .. ఎంతో జ్ఞానం ఉన్నా అసుర లక్షణాలు కలిగి ఉండడం వల్ల ఓ వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతుంది అని టీజర్ ని బట్టి తెలుస్తుంది.. మొత్తానికి డైరెక్టర్ టీజర్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడని చెప్పొచ్చు.. అతడి ప్రతిభ కూడా టీజర్ లోని కొన్ని షాట్స్ ద్వారా అద్భుతమని చెప్పొచ్చు. మరి సినిమాలో ఇంకెన్ని మలుపులు ఇస్తాడో చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here