మా ఎన్నికలు ముగిసినా.. అందులో వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికలు జరిగే సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ.. ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. నిన్న జరిగిన విలేకురుల సమావేశంలో ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మా లో ప్రస్తుతం మంచి వాతావరణం లేదని.. మాతో వాళ్లు కలిసి పని చేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన మొత్తం 11 మంది సభ్యులు రాజీనామా చేశారు. తమకు ఎన్నికల్లో అన్యాయం జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరగిందంటూ ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
రాత్రికి రాత్రే ఈసీ మెంబర్ల ఫలితాలు మారపోయాయని.. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉండగా.. నటుడు బెనర్జీ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎన్నికలు జరిగే రోజున మోహన్ బాబు తనను అరగంట బూతులు తిట్టాడని.. దానికి తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి తాను సనీ పరిశ్రమలో ఉంటున్నానని.. తనను మోహన్ బాబు అలా బూతులు తిట్టడం.. అది అందరిముందు అనడం.. అవమానించడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
మా ఎన్నికలు పూర్తయి మూడు రోజులు అవుతున్నా మోహన్ బాబు మాట్లాడిన మాటలు తనకు ఇంకా బాధ కలిగిస్తున్నాయని.. ఆ రోజు మోహన్ బాబు తనను కొట్టడానికి కూడా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. విష్ణు, మనోజ్ ఆపడంతో ఆగాడని.. అలాంటి అసోసియేషన్ లో నాకు రక్షణ ఉంటుందా.. అలాంటి వాటిలో తాను ఎందుకు ఉండాలి అంటూ ఎమోషనల్ అయ్యారు బెనర్జీ.































