Actor Chandan Kumar : కన్నడ నుండి వచ్చి చందన్ తెలుగు బుల్లితెరపై నటిస్తున్నాడు. స్టార్ మా లో వచ్చిన సావిత్రిసమ్మ గారి అబ్బాయి ద్వారా బుల్లి తెరకు పరిచయజం అయ్యాడు. ప్రస్తుతజం స్టార్ మా లో ప్రసారిమవుతున్న శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో హీరోగా చేస్తున్నాడు. అయితే సోమవారం ఈ సీరియల్ షూటింగులో గొడవ దుమారం రేపుతోంది. హీరో చందన్ అసిస్టెంట్ డైరెక్టర్ తో దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడటం కూడా జరిగింది.

చందన్ ను నిషేధించిన తెలుగు టీవీ ఫెడరేషన్…
చందన్ అసిస్టెంట్ డైరెక్టర్ తో గొడవపడుతూ.. అయన తల్లిని దూషించడంతో డైరెక్టర్ కూడా వాదనకు దిగడం జరిగింది. చందన్ ప్రవర్తన సెట్ లోని మిగతా వారికి కూడా నచ్చకపోవడంతో అందరు సీరియస్ అయ్యి క్షమాపణ చెప్పమని అనడంతో… చందన్ తగ్గకుండా నేనేంటో చూపిస్తా అనడం తో అసిస్టెంట్ డైరెక్టర్ అందరిముందు చందన్ ని కొట్టాడు. సెట్ లో ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడం, చందన్ అక్కడినుండి వెళ్లిపోవడం జరిగింది.

అయితే ఈ గొడవ ఇక్కడితో ఆగిపోయింది అని అనుకుంటే… చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు బుల్లితెర గురించి తక్కువ చేసి మాట్లాడటం తో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే తెలుగు టీవీ ఫెడరేషన్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై నిషేధం విధించింది. ఈ సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘నేను షాట్ రెడీ అని నాలుగు సార్లు అతన్ని పిలిచాను, అయినా కూడా రాకుండా నన్ను కొట్టడమే కాకుండా బూతులు తిట్టాడు. నేను డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ నన్ను బెదిరించాడు’ అని తెలియజేసారు. ఈ కారణంగా చందన్ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్ ను నిషేధించింది.































