Actor Devi Prasad : ఇండస్ట్రీకి డైరెక్టర్ అవ్వాలని వచ్చి కొన్నిసినిమాలతో హిట్లు కొట్టినా ప్రస్తుతం నటుడుగా మాత్రం మంచి గుర్తింపు అందుకున్న వ్యక్తి దేవి ప్రసాద్ గారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన చిన్నప్పటి నుండే ఇండస్ట్రీ వైపు రావాలనే ఆసక్తితో చదువుకున్న తరువాత ఇండస్ట్రీకి వచ్చారు. మొదట డైరెక్టర్ కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన శ్రీహరి తో ‘దాస్’ అనే సినిమా తీసినా అది వర్క్ అవుట్ అవ్వక ఆ తరువాత హీరో శ్రీకాంత్ తో ‘ఆడుతూ పాడుతూ’ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు. అలా డైరెక్టర్ గా బ్లేడ్ బాబ్జి, కెవ్వుకేక వంటి హిట్స్ అందుకున్న దేవి ప్రసాద్ గారు నటుడుగా ‘నీది నాది ఒకే కథ’ సినిమాలో హీరోకి తండ్రిగా నటించి మెప్పించారు. అలా నటుడుగా మారిన దేవి ప్రసాద్ గారు ప్రస్తుత నటుడుగా సినిమాలలో చేస్తూ బిజీ అవుతున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన కెరీర్ అలాగే ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను మాట్లాడారు.

కోడి రామకృష్ణ గారు అలా తిట్టేసరికి…
దేవి ప్రసాద్ గారు సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ తో ఇంటర్ చదివే సమయంలోనే చెన్నైలో తన బాబాయ్ ద్వారా షూటింగ్ కి వెళ్లి చూసేవారట. అయితే అప్పుడు ఇండస్ట్రీ అంటే భయమేసిదంటూ చెప్పారు దేవి ప్రసాద్. ఇక మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ సమయంలో కాలేజీ గొడవలతో పోలీస్ కేసులయి డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి చెన్నై కి సినిమా కోసం వెళ్ళాడు. ఇక అక్కడ బాబాయ్ సహకారంతో కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన దేవి ప్రసాద్ గారు ఆయన గురించి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒకసారి మిస్ కమ్యూనికేషన్ వల్ల సెట్ ప్రాపర్టీ రావడం ఆలస్యమైతే బుద్ధి లేదా చూసుకోవాలి కదా అని అందరిముందు కోడి రామకృష్ణ గారు దేవి ప్రసాద్ ను తిట్టడంతో ఆరోజంతా తినకుండా ఆలోచించారట.

ఇక ఇండస్ట్రీ వదిలేయాలని అనుకున్నాడట. స్క్రిప్ట్ పనులకోసం వచ్చిన వ్యక్తి విషయం తెలిసీ కోడి రామకృష్ణ గారి వద్ద ప్రస్తావించగా నేను అసలు తిట్టలేదని చెప్పడం, ఆ విషయం దేవి ప్రసాద్ కి చెప్పగా బుద్ధి లేదా అని తిట్టాడు అని చెబితే ఆ రైటర్ నవ్వి అంతేనా ఇంకా ఏం తిట్టాడో అని అనుకున్నాను, మా గురువులు ఏకంగా కొట్టేవారు. ఇదే తిట్టడం అయితే ఇంకా మమ్మల్ని మా గురువులు తిట్టడం కొట్టడంను ఏమనాలి అంటూ నవ్వారట. ఇక అక్కడితో విషయం వదిలేసి మళ్ళీ పని చేసుకున్నారట దేవి ప్రసాద్.



























