Actor Jogi Naidu : పవన్ కళ్యాణ్ హీరోనా లేక రాజకీయ నాయకుడా… జనసేనకి అంత సీన్ లేదు…: జోగి నాయుడు

0
226

Actor Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్స్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడరు.

పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ కాదు…

జోగి నాయుడు ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ వైసీపీ కి తాను సపోర్ట్ చేస్తున్నట్లు గతంలో తన అభిమాన నటుడైన చిరంజీవి గారు పార్టీ పెట్టగా తన నియోజకవర్గంలో పార్టీకి పనిచేశానని జోగి నాయుడు మాట్లాడరు. అయితే ప్రస్తుతం జగన్ అందరికీ మేలు చేస్తున్నారని తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ గురించి మాట్లాడుతూ ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ లాగానే ఇంకా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

ఒకవైపు సినిమాలను చేస్తూ మరోవైపు రాజకీయాలను చేస్తే జనాలు సీరియస్ గా తీసుకోవడం లేదంటూ తెలిపారు. ఆయన సినిమాలను వదిలి సీరియస్ రాజకీయాలు చేస్తే ప్రజలకు నమ్మకం రావొచ్చు ఆయన మీద అంటూ చెప్పారు. అలా చేయకపోతే జగన్ ముందు నిలబడే సీన్ జనసేనకు ఉండదు అంటూ ఇది నా అభిప్రాయం అంటూ చెప్పారు జోగి నాయుడు.