Actor Kota Srinivasarao : విలనిజంలో కొత్త స్టైల్ చూపిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన కమెడియన్ గాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా ఎన్నో షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయి ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనస్సులో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక కోటా గారు సినిమాల్లోకి వచ్చేకన్నా ముందే బ్యాంకులో ఉద్యోగిగా ఉండేవారు. కొన్నేళ్లు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే సినిమాలను చేస్తూ రెండింటి మీద ప్రయాణం చేసారు. ఇక సినిమాల్లో మెల్లగా స్థిరపడిపోయాక ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాల్లో నటించారు. అలా సౌత్ భాషలలో నటించిన ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సినిమాల్లో నటించడం లేదు. అయితే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆయన సినిమా కెరీర్ విశేషాలను చెబుతుంటారు.

ప్రకాష్ రాజ్ గొప్ప నటుడా…
కోటా శ్రీనివాసరావు గారు సినిమాల్లో నటిస్తూ యాక్టీవ్ గా ఉన్న సందర్భంలోనే పరభాషా నటులు తెలుగులో విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్టు గాను నటిస్తున్నారని తెలుగులో ఎవరూ లేరా అంటూ విమర్శించేవారు. ఇక ఒకానొక సందర్భంలో డైరెక్టర్ కృష్ణ వంశీ మీద కోటా ఫైర్ అయ్యారు. ఆయన క్షమాపణ చెప్పలంటూ డిమాండ్ చేసారు. మ్యాటర్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి ఒక ఏడాది క్యారెక్టర్ ఆర్టిస్టు గాను అలాగే విలన్ గాను మరో సినిమాకు రెండు నందులు రావడం పట్ల కృష్ణ వంశీ మాట్లాడుతూ తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరు అనడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్స్ చేసారు.

దీనికి కోటా గారు స్పందిస్తూ నంది అవార్డు వచ్చినంత మాత్రాన నటుడు అయిపోలేడు. అలాగైతే చిరంజీవి కే ప్రతిసారి నంది అవార్డు రాదు. ఎక్కువగా ఆర్ట్ సినిమాలకే అవార్డులు ఇస్తుంటారు అలాంటపుడు చిరంజీవి గొప్ప నటుడు కాడని అంటారా, అనగలమా. ఆందుకే కృష్ణ వంశీ తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోమని చెప్పాను అలాగే తెలుగు ఆర్టిస్టులను క్షమాపణ అడగాలని డిమాండ్ చేశాను అంటూ కోటా గారు వివరించారు.



























