Actor Nagineedu : ‘మర్యాద రామన్న’ సినిమాలో విలన్ గా సరికొత్త విలనిజం చూపించిన నాగినీడు గారు అంతకు ముందు ఆయన కెరీర్ సినిమాలకు ముందు ఆయన ఏం చేసేవారో అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన మర్యాద రామన్న సినిమా తరుసవాత ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. రాయలసీమ యాసలో ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఆయన ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆయన సినిమాలకంటే ముందు ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న నాగినీడు గారు కొన్ని సినిమాల విషయంలో ప్రసాద్ ల్యాబ్ సంస్థ ఎన్ని డబ్బులను కోల్పోయారో వివరించారు.

ఆ పెద్ద హీరో సినిమా విషయంలో చాలా నష్టపోయాము…
ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసిన సమయంలో చాలా సార్లు సినిమాల విషయంలో పేమెంట్ కొంత సినిమా రిలీజ్ అయ్యాక ఇస్తామని చెప్పి సినిమా సరిగా ఆడకపోయినా డబ్బు సంస్థకు రాదు అలాంటి బాకీలు చాలానే ఉంటాయి ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారికి అంటూ చెప్పారు. ప్రసాద్ లాబ్స్ రమేష్ గారికి మల్లెమాల ఎంఎస్ రెడ్డి గారికి మంచి పరిచయాలు ఉన్నాయి. అరుంధతి సినిమా సమయంలోనూ ల్యాబ్ ద్వారా సమస్యలను క్లియర్ చేసాం. ఇక ఒక పెద్ద హీరో సినిమా విషయంలో ఇలాగే జరిగినపుడు రమేష్ గారు ఆఫీస్ లో లేరు సినిమా విడుదల అవ్వాలి కానీ వాళ్ళు అప్పటికే 70 లక్షల దాకా ప్రసాద్ ల్యాబ్ కి బాకీ పడి ఉన్నారు.

అప్పుడు ప్రింటింగ్ పనులు సంస్థ చేయకపోతే సినిమా విడుదల కాదు అనే ఉద్దేశంతో నేనే నిర్ణయం తీసుకుని ప్రింటింగ్ చేయించి ఇచ్చాము. అది నేను సహాయం అనుకోను, వ్యాపారం అంతే. ఇప్పుడు సినిమా ప్రింటింగ్ చేసి బయటికి వస్తే డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొని ప్రొడ్యూసర్ కి డబ్బులు వస్తాయి. అలా వస్తే మా సంస్థకు రావాల్సిన డబ్బులను ఇచ్చేస్తారనే ఉద్దేశంతో అలా చేశాను, కానీ సినిమా పోయింది. అలానే రమేష్ గారికి వాళ్ళు బాకీ పడిన డబ్బులు ఇవ్వలేదు. ఇలాంటివి ఎన్నో బాకీలు రమేష్ గారికి ఉన్నాయి. కోట్లలో డబ్బులు సంస్థసకి రావాల్సి ఉంది అంటూ నాగినీడు గారు ప్రసాద్ ల్యాబ్ గురించి వివరించారు.



























