Actor Nagineedu : మర్యాద రామన్న సినిమాలో విలన్ గా సరికొత్త విలనిజం చూపించిన నాగినీడు గారు అంతకు ముందు ఆయన కెరీర్ సినిమాలకు ముందు ఆయన ఏం చేసేవారో అనే విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన మర్యాద రామన్న సినిమా తరువాత ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు. రాయలసీమ యాసలో ఫ్యాక్షనిస్ట్ గా నటించిన ఆయన ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆయన సినిమాలకంటే ముందు ప్రసాద్ లాబ్స్ లో జనరల్ మేనేజర్ గా పని చేసేవారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న నాగినీడు గారు కొన్ని సినిమాల విషయంలో ప్రసాద్ ల్యాబ్ సంస్థ ఎన్ని డబ్బులను కోల్పోయారో వివరించారు. అలాగే ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ గారితో ఉన్న అనుబంధం ఆయన కొడుకు తో ఉన్న విభేదాల గురించి కూడా మాట్లాడారు.

ఆయనతో విభేదాలు లేవు… పవన్ కళ్యాణ్ అలా అంటరాని అనుకోలేదు…
ప్రసాద్ లాబ్స్ అధినేత రమేష్ గారితో చక్కటి అనుబంధాన్ని కొనసాగించిన నాగినీడు గారు ప్రసాద్ లాబ్స్ లో పనిచేస్తున్న సమయంలో అన్ని వ్యవహారాలను చూసుకునేవారు. ఇక రమేష్ గారి అబ్బాయి సాయి ప్రసాద్ తో మాత్రం కొద్దిగా దూరంగా ఉండేవారట, దీనికి కారణం ఏజ్ గ్యాప్ మాత్రమే అంటూ ఆయన చెప్పారు. రమేష్ గారు బంధువు అవ్వడం ఆయన కొడుకు సాయి కి కజిన్ బ్రదర్ అయినా కూడా అంకుల్ అనే పిలిచేవారట. అయితే ఇద్దరి మధ్య విభేదాలంటూ ఏమి లేకపోయినా సాయి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాక అదే గౌరవం ఆయనకు ఇచ్చేవాడినంటూ అయితే వయసు తేడా వల్ల తన ఆలోచనలు నా ఆలోచనలు కొంచెం తేడాగా ఉండేవంటూ చెప్పారు నాగినీడు గారు. అయితే నా పనితనానికి ఎపుడూ మెచ్చుకుంటూ ఉంటాడంటూ చెప్పారు. ఇక చాలా సినిమాల్లో నాగినీడు గారు నటించినా మర్యాద రామన్న, మిర్చి, గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

గబ్బర్ సింగల్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించినపుడు పెద్దగా డైలాగులు లేకపోయినా హావభావాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో నాగినీడు గారికి గుండె పోటు వచ్చే సీన్లో పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని మాట్లాడే ఎమోషనల్ డైలాగు చాలా బాగా పండింది. ఇక సీన్ అయిపోయాక కూడా నాగినీడు గారు అదే ట్రాన్స్ లో ఉన్నారట. నిజంగా కొడుకులా మాట్లాడినట్లే అనిపించింది అంటూ చెబుతూ పవన్ వచ్చి చాలా బాగా చేసారని చెప్పినా వినిపించుకోలేదట. ఆ తరువాత మళ్ళీ ఒక రెండు రోజులకు వెళ్లి మీ నటన చాలా బాగుంది, అదే ట్రాన్స్ లో ఉండిపోవడం వల్ల మీరు మళ్ళీ ఏం మాట్లాడారో నాకు వినిపించలేదు అని చెబితే నేను అదే చెప్పాను మీరు బాగా నటించారు, సీన్ చాలా బాగా వచ్చింది అని చెప్పారట. అలా పవన్ కళ్యాణ్ అంటరాని అస్సలు ఊహించలేదు అంటూ నాగినీడు గబ్బర్ సింగల్ షూటింగ్ అనుభవాలను చెప్పారు.































