Actor Pragathi : తెలుగులో అమ్మ పాత్రలలో ఎక్కువగా మెరిసి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన నటి ప్రగతి అందరికీ తెలుసు. ఇదంతా కరోనా ముందు అనలేమో ఇప్పుడు మాత్రం అమ్మ పాత్రలతో కాదు ఇంస్టాగ్రామ్ రీల్స్ తో బాగా పాపులర్. కూతురూతో కలిసి డాన్సులు, ఇక తన వర్క్ అవుట్ వీడియోలతో తాను ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోను అన్నట్లుగా దూసుకెళుతోంది. ఇక ప్రగతి ఆంటీ కి ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ప్రగతి మొదట హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా ఒక ఏడో ఎనిమిదో సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడారు.

హద్దు మీరి మాట్లాడవద్దు…
సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే ప్రగతి తన వర్క్ ఔట్స్ అలాగే డాన్స్ వీడియోలను ఎక్కువగా యూట్యూబ్ మాద్యమం ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే అలా వీడియోస్ పెట్టడం వల్ల నెగెటివిటీ ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతో మంది ఆమెకు ఫాలోయర్స్ ఉంటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నా కొంత మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వల్ల గురించి తాను పట్టించుకోను అంటూ ప్రగతి చెప్పారు.

అలా కామెంట్స్ చేసే వాళ్ళు మొదట వాళ్ల యింట్లో ఆడవాళ్లకు ఎంత గౌరవం ఇస్తున్నారో ఊహించుకుంటే బాధేస్తుంది. ఇక మరి కొంతమంది ఈ వయసులో నీకు జిమ్ అవసరమా అంటూ పెడతారు ముందు నీ పొట్ట చూసుకుని కామెంట్స్ పెట్టరా అని అనాలనిపిస్తుంది. ఫిట్ నెస్ అనేది ఏ ఏజ్ వారికైనా అవసరమే అందులో తప్పేంటి, సినిమాలో నేను సరిగా నటించకపోతే మీరు కామెంట్స్ చేయడం కరెక్ట్, నా వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటే మీకేంటి అంటూ ప్రగతి ఫైర్ అయ్యారు. హద్దు మీరకపోతే బాగుంటుంది అను చెప్పారు.































