Actor Praksh Raj : విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సినిమాలే కాకుండా ప్రస్తుతం పాలిటిక్స్ లోనూ విలక్షణంగానే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటకలో చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించిన ప్రకాష్ ఆ తరువాత తమిళ సినిమా ద్వారా సినిమాకు పరిచయమైయ్యాడు. ఆ తరువాత తెలుగు, మలయాళం అంటూ అన్ని భాషలలోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా ఏదైనా పాత్ర ఏదైనా ప్రకాశ్ రాజ్ నటన సినిమాకు ప్లస్ అనేలా ఆయన నటిస్తారు. నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ విలనిజం చూపించినా, అంతఃపురంలో ఫ్యాక్షన్ నేతగా చేసినా, ఖడ్గంలో ఒక భారతీయ ముస్లింగా నటించినా అన్నింటిలోనూ తన పాత్రకు న్యాయం చేసాడు ప్రకాష్ రాజ్. తాజాగా కృష్ణ వంశీ డైరెక్షన్ లో రంగమార్తాండ సినిమాలో నటించిన ఆయన ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.

అందరికీ అన్నయ్య అందుకే ఆయన వాయిస్…
ప్రకాష్ రాజ్ గారు మెయిన్ లీడర్ గా ఒక రంగస్థల నటుడుగా చేసిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో నాటకంలో పాత్రకు న్యాయం చేయగల వ్యక్తి నిజజీవితంలోని పాత్రకు న్యాయం చేయని వ్యక్తిగా మిగులుతాడు. ఈ కథను కృష్ణ వంశీ చక్కగా క్యారీ చేసాడు, భావోద్వేగాలు చక్కగా పండాయి అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక సినిమా కథ మరాఠి సినిమా నట సామ్రాట్ నుండి తీసుకున్నది. అయితే మొదట ఆ సినిమా డైరెక్షన్ చేయాలనుకున్నది ప్రకాష్ రాజ్ గారే కానీ చివరికి కృష్ణ వంశీ గారికి ఇచ్చేసారు. ఈ విషయం గురించి చెబుతూ నేను నటుడుగా ఆ పాత్రకు సపూర్ణంగా న్యాయం చేయాలంటే నేను దర్శకత్వ బాధ్యతల నుండి పక్కకు రావాలి. అంత మంచి కథ నా కన్నా మంచిగా డైరెక్ట్ చేసే వ్యక్తి చేతిలో పెట్టడం సబబు అనిపించింది. కృష్ణ వంశీ అయితే ఈ కథ బాగా హ్యాండిల్ చేస్తాడనిపించి ఇచ్చాను.

నా నిర్ణయం కరెక్ట్ అనిపించింది అంటూ చెప్పారు. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ చిరంజీవి గారి వాయిస్ ఓవర్. దాన్ని గురించి మాట్లాడుతూ ఆయన గొప్ప నటుడు, ఆయన ఈ సినిమాలో నటుల గురించి చెబితే బాగుంటుంది అనిపించింది. అదీ కాక ఆయనను మించి ఆ డైలాగు చెప్పేందుకు ఇంకెవరికి ఉంది ఆ స్థాయి అనిపించింది. ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు నేడు పెద్దవాళ్ళు అయిపోయినా ఇప్పటికీ యూత్ ఆయన ఫ్ఫాన్స్ గా ఉంటున్నారు. అంతకంటే గొప్ప నటుడు ఎవరు. ఆయన చెబితేనే అక్కడ కరెక్ట్ అనిపించింది అంటూ ఆయన ఊరికే అందరికీ అన్నయ్య అయిపోలేదు కదా అంటూ మాట్లాడారు.

































