Actor Rajeev Kanakala : చైల్డ్ ఆర్టిస్ట్ రోజా రమణి గారి అబ్బాయి గా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆపైన హీరోగా ‘నువ్వే కావాలి’ సినిమాతో మంచి హిట్ కొట్టిన హీరో తరుణ్. ఆ సినిమా ఘన విజయం తరువాత తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో ఎన్నో సినిమాలను చేసారు. నువ్వే కావాలి తరువాత నువ్వులేక నేను లేను, ప్రియమైన నీకు అంటూ ఇలా హిట్లందుకుంటూ స్టార్ హీరో గా ఎదిగిన తరుణ్ అర్థాంతరంగా తన కెరీర్ మసకబారింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ కి ఇప్పటికీ ఎంతో మంది అభిమానులు మాత్రం ఉన్నారు. ఆయన మళ్ళీ సినిమాల్లో నటిస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఆయన డిప్రెషన్ లో ఉన్నాడంటూ వస్తున్న వార్తలను గురించి నటుడు రాజీవ్ కనకాల స్పందించారు.

తరుణ్ చాలా స్ట్రాంగ్…
చాలా ఏళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి తరుణ్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించడం లేదు. కేవలం ఇండస్ట్రీ తరుపున క్రికెట్ పోటీలలో అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తుంటారు. అయితే మళ్ళీ హీరోగా ఎంట్రీ ఇస్తాడని ఆయన తల్లి రోజా రమణి ఇంటర్వ్యూలలో చెబుతూనే ఉన్నా తరుణ్ డిప్రెషన్ లో ఉన్నాడంటూ కథనాలు వినియించాయి.

తనకు మంచి స్నేహితుడిగా ఉన్న రాజీవ్ కనకాల ఈ విషయం గురించి మాట్లాడుతూ అలాంటిదేమి లేదు. తరుణ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. తాను డిప్రెషన్ లో ఉండటం వంటిదేమి లేదు. ప్రస్తుతం సినిమా చేయాలని వస్తే మంచి కథతో రావాలని అనుకుంటున్నాడు. అందుకే బాగా కథలను వింటున్నాడు. తన వెనుక ఏదో బాగా ప్లాన్ జరుగుతోంది. త్వరలో ఖచ్చితంగా మంచి సినిమాతో వస్తాడు అంటూ చెప్పారు.

































