Actor Rana: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే
నేపోటిజం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్టార్ సెలబ్రిటీలను విమర్శలు చేస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి విమర్శలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. ఇక తెలుగులో కూడా అప్పుడప్పుడు పలువురు నెపోటిజం గురించి మాట్లాడుతూ ఉంటారు.

సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి హీరోలలో టాలెంట్ లేకపోయినా వారికి అవకాశాలు వస్తాయని టాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తున్నారు అంటూ పలుసార్లు గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే కొందరు హీరోలు సెలబ్రిటీలు నెపోటిజం గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా నెపోటిజం గురించి నటుడు రానా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగాలి అంటే వారసత్వం బంధుప్రీతి ఏమాత్రం పనికిరావని ఆయన తెలిపారు. నటనతో మన ప్రతిభను కనబరచకపోతే ఇండస్ట్రీలో ముందుకు రాలేమని వెల్లడించారు. నటుడిగా తన జీవితంలో బంధు ప్రీతితోను అలాగే టాలెంట్తో ముందుకు వెళ్లడం చూసానని తెలిపారు. తెలుగులో నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి నేను ఇండస్ట్రీకి చెందిన మనిషిని కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో నేను ఎవరో కూడా తెలియదు. సౌత్ నుంచి వెళ్లడంతో తనని చెన్నై అని చాలామంది అనుకున్నారు.

Actor Rana:అప్పుడే నిజమైన విజయం సాధించినట్లు…
తన దృష్టిలో వారసత్వం అనేది కేవలం మనల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడం వరకు మాత్రమే ఉపయోగపడుతుందని ఆపై మన టాలెంట్ తో మన ఇండస్ట్రీలో నిలబడాలని తెలిపారు. ఇక తన తాత ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సినిమాలు నిర్మించారు. అనంతరం తన తండ్రి బాబాయ్ స్టూడియో నిర్మించి ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే వారసుడిగా వారి పేర్లను నేను నిలబెట్టినప్పుడే విజయం సాధించినట్లు అంటూ రానా తెలిపారు.





























