చిత్ర పరిశ్రమ చాలా మంది నటీనటుల జీవితాన్నే మార్చేస్తుంది. అయితే నటీనటులు సక్సెస్ అయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఆ విజయం సాధించేందుకు వాళ్లు ఎంత కష్టపడ్డారో అన్న విషయం గురించి ఎవరు ప్రస్తావించరు. అలాగే వాళ్ళు ఆ సక్సెస్ అయ్యేందుకు ఎంత టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు వాళ్లు కష్టపడ్డారు అనేది మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు అనే చెప్పాలి. ఇక తెలుగు ఇండస్ట్రీతో పాటు పలు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని… వందల సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సాయాజీ షిండే గురించి అందరికీ తెలిసిందే. కానీ అతను ఒక కాలేజీ కి వాచ్ మెన్ గా పని చేశాడు అన్న విషయం మటుకు చాలా వరకు తెలియదు.

సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు అతను మూడు సంవత్సరాల పాటు ఒక కాలేజ్ వాచ్ మెన్ గా పని చేయడం జరిగింది. అతను పేరుకి మరాఠీ నటుడు అయినా కూడా మన తెలుగు సినిమాలలో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ మంచి ప్రత్యేకత ఫాలోయింగ్ దక్కించుకున్నాడు సాయాజీ షిండే. ఇక పోకిరి సినిమాలో ” తిన్నావా… పడుకున్నావా… తెల్లారిందా… “, ” లారీ ఢీ… ముగ్గురు ఠా …” అంటూ చెప్పిన పంచు డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈ సినిమా కంటే ముందు చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో కూడా పరిచయమై మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆ సినిమా అనంతరం 50 సినిమాలు పైగా సాయాజీ షిండే నటించడం జరిగింది. ఆ సినిమాలలో దాదాపు 90% సినిమాలలో తానే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. అతనికి తెలుగు భాష రాకపోయినా కూడా తెలుసుకొని మరీ డబ్బింగ్ తానే సొంతంగా చెప్పుకోవడం విశేషం.

తాజాగా తన పర్సనల్ విషయాల గురించి ఆయన పంచుకోవడం జరిగింది. సాయాజీ షిండేది మహారాష్ట్ర.. వాళ్ళది చాలా పేద కుటుంబం అని తెలియజేశాడు. తన సొంత ఊరిలోనే ఏడో తరగతి వరకు విద్యనభ్యసించి ఆ తర్వాత పక్క ఊరికి వెళ్లి 10వ తరగతి పూర్తి చేసుకున్న అని తెలియజేశారు. అనంతరం కాలేజీలో జాయిన్ అయ్యానని… కాలేజీ ఫీజు కోసం అదే కాలేజీలో మూడు సంవత్సరాలపాటు వాచ్ మెన్ గా పని చేశానని తెలియజేశాడు. ఉదయం పూట చదువుకోవటం, రాత్రి అదే కాలేజీలో వాచ్ మాన్ గా పని చేయడం…. ఆ వచ్చిన డబ్బులతో ఫీజ్ పట్టుకోవడంతో పాటు నెలసరి ఖర్చులకు ఉపయోగించే వాడినని తెలిపాడు.

ఆ తర్వాత 1978 – 79 సంవత్సరాలలో నాటకాల వైపు వెళ్లడం జరిగిందని ఆ తర్వాత నుంచి సినిమాల వైపు ప్రయాణం కొనసాగించాను అంటూ తెలిపాడు. ఇక ఇతను 1987 సంవత్సరంలో నటించిన జుల్వా అనే నాటకం అతనికి మంచి పేరు గుర్తింపు లభించింది. ఆ తర్వాత కూడా మరాఠిలో చాలా నాటకాలు కూడా నటించాడు. ఇక అప్పటి నుంచి మెల్లగా వెండితెర వైపు మొగ్గు చూపాడు. ముందుగా మరాఠీ సినిమాలలో తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ తర్వాత… దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటించి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంతకంతకు ఎదిగాడు. సినీ ఇండస్ట్రీలో నిజంగా తానే సొంతంగా ఎవిరిమీద ఆధారపడకుండా ఎదిగినవారిలో ఈయన పేరు కూడా చెప్పుకోవచ్చు.



























