Actor Shivaji : అద్దె కట్టడానికి కూడా నాకు డబ్బులు లేని సమయంలో చిరంజీవి ఆదుకున్నారు…: నటుడు శివాజీ

0
66

Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించిన హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ . అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి, కే ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ రాజకీయాల వైపు వచ్చి గరుడ పురాణం అంటూ ఆ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. తాజగా ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ లోని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

నన్ను చిరంజీవి అడగకుండానే ఆదుకున్నారు…

శివాజీ మొదట బుల్లితెర లో పనిచేసిన ఆ పైన అనుకోకుండా హీరో అయ్యారు. వచ్చిన అవకాశం ఏది వదలకుండా సినిమాలు చేస్తూ హీరో అనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సినిమాలను చేయడం వల్ల మధ్యలో అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో కొంత ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో అడగకుండానే మెగాస్టార్ చిరంజీవి సహాయం చేసారని ఆ మేలు జీవితంలో ఎప్పటికి మర్చిపోలేనంటూ చెప్పారు.

ఆయనతో ఒక సినిమాలో నటిస్తున్న సమయంలో ఆయనకు నేను ఇబ్బందుల్లో ఉన్నానని తెలిసి షూటింగ్ అయ్యాక బస్సు లో అందరం వెళ్తున్న సమయంలో పక్కన కూర్చొని జేబులో డబ్బు పెట్టి వెళ్లిపోయారు. నేను అడగకుండానే ఇచ్చారు. ఆయన ఇచ్చిన పదివేల రూపాయల డబ్బు సంవత్సరం పాటు ఇంటి అద్దె కట్టడానికి ఉపయోగపడింది అంటూ అందుకే అప్పటి నుండి నాతో ఉన్న లేకపోయినా ఇంకొకరికీ సహాయం చేయాలనీ అనుకుంటాను ఇప్ప్పటికి చేస్తున్నాను అంటూ శివాజీ తెలిపారు.