Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించిన హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు, సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీకి కేఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా యాంకర్ గా ఉన్న సమయంలోనే రాఘవేంద్ర రావు పరదేశి సినిమా ఆడిషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా పాల్గొని అందులో లయతో పాటు రెండో ప్లేస్ తెచ్చుకున్నాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవమానాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎన్టీఆర్ కి నాకు గ్యాప్ అలా వచ్చింది…
శివాజీ ఇండస్ట్రీలో ఉండే పలు రకాల వ్యక్తుల గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. అప్పటి ఇండస్ట్రీలో సైడ్ మనకు చెడు చెప్పేవారు ఎక్కువగా ఉండేవారు. హీరోల పక్కన చేరి వాళ్లకు నచ్చని వారి గురించి చాడీలు చెప్పేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడున్న హీరోలు బాగా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నారు. అపట్లో లాగా పరిస్థితులు లేవు అంటూ శివాజీ చెప్పుకోచ్చారు.

ఆది సినిమా సమయం వరకు ఎన్టీఆర్ నాతో బాగా ఉండేవాడు. కనిపిస్తే మాట్లాడటం అలా కొంచం టచ్ ఉండేది అయితే ఆ సినిమా తరువాత మా మధ్య ఒక వ్యక్తి గ్యాప్ వచ్చేలా చేసాడని అనుమానం ఉంది అంటూ తెలిపారు. అప్పటి నుండి ఎన్టీఆర్ తో పెద్దగా టచ్ లేకుండా పోయింది అంటూ తెలిపారు. ఇక మరో పెద్ధ నటుడి తండ్రి మరణిస్తే వెళ్లి పరామర్శించి హాగ్ చేసుకోబోతే చేతులు తీసి దూరం జరిగాడు. స్టేటస్ అడ్డొచ్చింది అని అర్థమైంది. మళ్ళీ అధ్యాత్మిక మాటలు మాట్లాడుతూ పైకి కథలు చెబుతుంటాడు ముందు మనిషిలాగ మారు హీరో అంటూ ఫైర్ అయ్యారు శివాజీ.



























