Actor Shyam : మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ శ్యామ్ మొదట తమిళంలో పరిచయమాయ్యడు. ఇక తెలుగులో ‘కిక్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శ్యామ్ ఆ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కళ్యణ్ రామ్ కత్తి, అలాగే రేసుగుర్రం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక రేసుగుర్రం సినిమా గురించిన విశేషాలను చెబుతూ అలాగే బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

అల్లు అర్జున్ కంటే, విజయ్ మంచి డాన్సర్…
రేసుగుర్రం సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ చాలా డెడికేటెడ్ నటుడు. చాలా కష్టపడుతారు అంటూ చెప్పారు. ఇక డాన్స్ గురించి ప్రస్తావన రాగా చాలా మంచి డాన్సర్, ఒక పాట డాన్స్ కోసం మూడు నెలల ముందే డాన్స్ మాస్టర్ తో ఎలా ఉండాలి అంటూ చర్చించి స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తాడు, ఆ డెడికేషన్ కు నేను ఫిదా అంటూ చెబుతూ తమిళ్ హీరో విజయ్, అల్లు అర్జున్ లలో గ్రేట్ డాన్సర్ ఎవరు అనే ప్రశ్న ఎదురైనపుడు ఖచ్చితంగా తలపతి విజయ్ గ్రేట్ డాన్సర్ అల్లు అర్జున్ కన్నా ఆ విషయంలో బన్నీ నే ఒప్పుకున్నాడు.

విజయ్ నటన, డాన్స్ అన్నింటిలోనూ ఒక లెవెల్ లో ఉన్నారు అంటూ చెప్పారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఎవరికీ మహేష్ కి వచ్చిన కష్టం రాకూడదు చాలా తక్కువ టైములో అన్న, అమ్మ, నాన్న ను కోల్పోయారు. ఆయనను చాలా స్ట్రాంగ్ గా ఉండేలా దేవుడు చూడాలి అంటూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.



























